రానూ రానూ పెద్ద సినిమాల పరిస్థితి మరీ కామెడీగా మారిపోతోంది. ఓ వైపు కోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీస్తుంటే, ప్రభుత్వాలు చుక్కలు చూపిస్తున్నాయి. మరోవైపు కంటెంట్ లో గానీ, పోస్టర్ లో గానీ ఏ మాత్రం తేడా వచ్చినా అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. ఇన్ని గందరగోళాల నడుమ ఇస్తోన్న చిత్ర యూనిట్ ఇస్తోన్న ‘అప్ డేట్స్’ కూడా మరింత హాస్యాస్పదంగా మారిపోతున్నాయి.
తాజాగా ‘భీమ్లా నాయక్’ చిత్ర నిర్మాణ సంస్థ నుండి సాయంత్రం నాలుగు గంటలకు ఓ ‘అప్ డేట్’ రానుందని ఉదయం నుండి సోషల్ మీడియాలో మారుమ్రోగుతోంది. బహుశా మరో పాటకు సంబంధించిన విషయం తెలియజేయడానికి లేక కొత్త సంవత్సరం సందర్భంగా షార్ట్ గ్లిమ్స్ ఏమైనా రిలీజ్ చేయబోతున్న ప్రకటన ఇస్తారేమో అని అంతా భావించారు.
కానీ సాయంత్రం నాలుగు గంటలు అయిన పిదప వచ్చిన ట్విస్ట్ ఏమిటంటే, మంగళవారం ఉదయం 11 గంటలకు ‘అప్ డేట్’ ఇస్తామని చెప్పడానికి, ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఈ ‘అప్ డేట్’ ఇచ్చారట. మరీ ఫ్యాన్స్ తో ప్రొడక్షన్ సంస్థ ఆడేసుకోవడం అంటే ఇదే కదా! ఇందులో గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, ఈ సాయంత్రం ‘అప్ డేట్’ ఇస్తామని ఉదయం మరో ‘అప్ డేట్’ ఇచ్చి ఉన్నారు.
దీంతో ‘భీమ్లా నాయక్’ చిత్ర నిర్మాణ సంస్థ పట్ల గుర్రుగా ఉన్న నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ ప్రారంభించారు. ఈ ‘అప్ డేట్స్’తో మాతో ఆడుకోవడమేంటి? అంటూ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇన్ని ‘అప్ డేట్’ల నడుమ అసలు కంటెంట్ రిలీజ్ అయ్యే ‘అప్ డేట్’ ఏమిటో తెలుసా… మూడు రోజుల తర్వాత కొత్త ఏడాది సందర్భంగా విడుదల చేస్తామన్న ‘అప్ డేట్’ గురించి!
ఇది ఒక్క “భీమ్లా నాయక్” సినిమాకే పరిమితం కాలేదు. ప్రతి పెద్ద సినిమా ప్రొడక్షన్ సంస్థ కూడా ఇదే తీరును సోషల్ మీడియాలో అవలంభిస్తోంది. సోషల్ మీడియాలో ఉన్న అభిమానులను ఎప్పుడూ యాక్టివ్ గా ఉంచేందుకు చిత్ర యూనిట్స్ పడుతోన్న ఈ ‘అప్ డేట్స్’ తాపత్రయం బెడిసికొడితే, అసలుకే మోసం వస్తుందన్న విషయాన్ని నిర్మాణ సంస్థలు కూడా గమనించుకోవాలి.
https://twitter.com/vamsi84/status/1475777299018518529
31st na update isthunam ani Repu 11 ki vache update ki ipudu 4 ki update ichi dhaniki update ga indhaka 3pm ki update icharu
Super anna manchiga undandi
— Rusthum (@RusthumHere) December 28, 2021



