ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు కనుకనే..

Pawan kalyan From Power Star to Andhra Pradesh Deputy CM

పవర్ స్టార్, జనసేనాని, ఏపీ ఉప ముఖ్యమంత్రి, మంత్రి…. పవన్‌ కళ్యాణ్‌ పుట్టినరోజు ఈ రోజు. ముందుగా ఆయనకు అందరి తరపున అభినందనలు.

పవన్‌ కళ్యాణ్‌ మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ రంగంలోకి, ఆ తర్వాత రాజకీయాలలోకి ప్రవేశించారు. రెండు రంగాలలో కూడా విజయం సాధించారు.

ADVERTISEMENT

సినీ పరిశ్రమలో చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లా ఉన్నప్పటికీ, పవన్‌ కళ్యాణ్‌ స్వశక్తితోనే తనకంటూ ఓ ఇమేజ్, అభిమానులు, పవనిజం అనే ముద్ర కూడా సంపాదించుకున్నారు.

చిరంజీవి రాజకీయాలలో ఎక్కడ ఫెయిల్ అయ్యారో అక్కడ నుంచే పవన్‌ కళ్యాణ్‌ రాజకీయ ప్రయాణం ఆరంభించడం నిజంగా చాలా సాహసోపేతమే అని చెప్పక తప్పదు. మరొకరైతే కలలో కూడా అటువంటి ఆలోచన చేయరు!

అభిమానులను నమ్ముకొని మొదలుపెట్టిన ఆ ప్రయాణంలో నేటికీ వారు ఆయన వెన్నంటే ఉన్నారు. వారికీ ఆయనకు మద్య ఎంత బలమైన ‘రిలేషన్‌షిప్’ ఉందో ఇది సూచిస్తుంది.

ఒడిదుడుకులు, అవమానాలు, ఓటములు ఎన్ని ఎదురైనా నిలబడి పోరాడుతానని పవన్‌ కళ్యాణ్‌ చెప్పారు. చెప్పినట్లుగానే నిలబడి పోరాడి విజయం సాధించారు. తనతో ప్రయాణం చేసిన వారందరినీ కూడా గమ్యానికి చేర్చారు. ఒక నాయకుడుకి ఉండాల్సిన గొప్ప లక్షణం ఇదే.

జగన్‌ నోటికి బలైపోయిన పవన్‌ కళ్యాణ్‌ నేడు ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రిగా, మంత్రిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రులతో నేరుగా మాట్లాడేంత స్థాయికి ఎదిగారు.

సినీ రాజకీయ రంగాలలో ఇంత ఎత్తుకు ఎదిగినప్పటికీ నేటికీ అదే నిరాడంబరత, అదే కలుపుగోలుతనం, అదే వినయ విధేయతలు.

ప్రధాని మోడీ, సిఎం చంద్రబాబు నాయుడుతో ఎంత వినమ్రంగా ఉంటారో మారుమూల గిరిజన ప్రాంతాలలో నిరుపేద ప్రజలతో కూడా అంతే వినమ్రంగా, ప్రేమాభిమానాలు ప్రదర్శిస్తారు.

పవన్‌ కళ్యాణ్‌ ఒక్కప్పుడు చాలా ఆవేశంగా మాట్లాడేవారు. ఇప్పుడు ఎంతో శాOతంగా మాట్లాడుతున్నారు. కానీ అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కూడా ఆయన మాట జారలేదు. ఎవరినీ కించపరచలేదు. ఇటువంటి గుణాలు లేదా లక్షణాలే పవన్‌ కళ్యాణ్‌ని మిగిలిన సినీ, రాజకీయ నాయకులకు భిన్నంగా నిలబెడుతోంది.

సినీ పరిశ్రమలో ఒక హిట్ పడితే చాలు మళ్ళీ కొంత కాలం వెనక్కు తిరిగి చూసుకోవలసిన అవసరం ఉండదు. కానీ రాజకీయాల్లో ప్రతీరోజూ అగ్నిపరీక్షలు ఎదుర్కొంటూనే ఉండాలి.

అటు పార్టీ శ్రేణులను, ఇటు ప్రజలను రోజూ మెప్పిస్తూనే ఉండాలి. మరోపక్క వైసీపీ విసిరే బురదని రోజూ కడుక్కుంటూనే చాలా సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. పవన్‌ కళ్యాణ్‌ ఇలాగే ముందుకు సాగుతున్నారు. ఎక్కడ నెగ్గాలో… ఎక్కడ తగ్గాలో తెలిసినవాడు కనుకనే….. పవన్‌ కళ్యాణ్‌ని అందరూ ‘ఓజీ’ అంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories