“మెగా బ్రదర్స్” కలయిక వెనుక రాజకీయ కోణం!

Pawan-Kalyan-Chiranjeevi-Meetమెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకుని తన అన్నయ్యకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి చిరు ఇంటికి వెళ్ళడం హాట్ టాపిక్ గా మారింది. భార్య అన్నా లేజేనోవా, కూతురు మరియు కొడుకుతో సహా మెగాస్టార్ ఇంట ప్రత్యక్షం కావడం, మెగా అభిమానులకు ‘ఐ ఫీస్ట్’ అని చెప్పుకోవచ్చు.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఇందులో రాజకీయ కోణం కూడా లేకపోలేదు అన్న టాక్ కూడా ప్రచారంలో ఉంది. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉండడంతో, మెగా అభిమానులందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి, జనసేనకు అనుకూలంగా మార్చే ప్రక్రియలో భాగమే ఇదంతా అన్న వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే చిరు ఇంట పెళ్లి జరిగినపుడే పవన్ హాజరు కాలేదు, అందులోనూ పుట్టినరోజులంటే పవన్ కు ఎంత మక్కువో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

గతంలో కూడా చిరు పుట్టినరోజుల సమయంలో పవన్ ప్రత్యేకంగా హాజరైన సందర్భాలున్నాయి గానీ, ఈ సారి ఏకంగా భార్య పిల్లలతో హాజరు కావడం అనేది ఊహించని అంశమే. ఇదంతా రాజకీయ లబ్ది కోసమే అంటే అభిమానులకు జీర్ణించుకోలేని విషయమే. అయితే ఇటీవల కాలంలో పవన్ కూడా సాధారణ రాజకీయ నాయకుల మాదిరి ప్రవర్తిస్తుండడంతో, ఏ అడుగైనా రాజకీయ కోణంలో చూడాల్సి రావడం విమర్శకుల వంతవుతోంది.

ADVERTISEMENT
Latest Stories