నాకు నలుగురు పిల్లలు… పంచాయతీ ఎన్నికలు పెట్టండి… పవన్ కళ్యాణ్

Pawan Kalyan comments on Panchayat Electionsజనసేన అధినేత పవన్ కళ్యాణ్ చిత్రమైన ప్రకటన చేశారు. జనసేన విజయం సాధిస్తుందనే భయంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు. ఇక్కడ వరకు బానే ఉంది. ఏ పార్టీ అయినా తమ శ్రేణులలో ఉత్సాహం తేవడానికి అటువంటి ప్రకటనలు చెయ్యడం సహజమే అయితే పవన్ మరో చిత్రమైన మాట అన్నారు.

ADVERTISEMENT

[m9ad]

తనకు నలుగురు పిల్లలు ఉన్నారని, సర్పంచిగా పోటీ చేసే అర్హత లేదు కనుక ముఖ్యమంత్రి తక్షణం పంచాయతీ ఎన్నికలు నిర్వహించుకోవచ్చని సూచించారు. ఇద్దరు పిల్లలే ఉంటే మాత్రం పవన్ కళ్యాణ్ సర్పంచ్ గా పోటీ చేస్తారా? పవన్ కళ్యాణ్ కు అర్హత లేదు గనుక ఎన్నికలు నిర్వహించుకోవడమేంటో?

ఒకవేళ ఇప్పటికిప్పుడు పంచాయతీ ఎన్నికలు జరిగితే మాత్రం జనసేనకు ఘోర పరాభవం తప్పదేమో. పార్టీ పెట్టి ఇన్ని సంవత్సరాలైనా గ్రామస్థాయిలో ఆ పార్టీకి అసలు పట్టు లేదు. ఎన్నికలు జరిగితే అభ్యర్థులను నిలబెట్టడమూ కష్టమే. ఈ తరుణంలో పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడమే మంచిది జనసేనకు.

ADVERTISEMENT
Latest Stories