ఇంతకూ పవన్ కళ్యాణ్ ఎక్కడ నుండి పోటీ చేస్తారు?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీచేసే అవకాశం ఉందా? ఆయన ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. పిఠాపురం ప్రత్యేకత శ్రీపాద శ్రీవల్లభుడేనని ఆయన ఆశీస్సులుంటే ఇక్కడి నుంచే పోటీ చేస్తానేమోనని అన్నారు. అయితే గతంలో కూడా వేరువేరు నియోజకవర్గాలలో ఇదే విధంగా పవన్ కళ్యాణ్ తాను పోటీ చెయ్యవచ్చు అంటూ సంకేతాలు పంపారు.

ADVERTISEMENT

[m9ad]

అనంతపూర్ నుండి పోటీ చేస్తా అని ఒక సారి, పాడేరు నుండి పోటీ చెయ్యాలని ఒక్క సారి, ఏలూరు నుండే పోటీ అంటూ మరొక్కసారి రకరకాల మాటలు చెప్పారు పవన్ కళ్యాణ్. ఈ లిస్టులో పాడేరు ఎస్టీ రిజర్వుడు సీటు కావడంతో అక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం లేనట్టే. మరి ఆయన ఫైనల్ గా ఎక్కడ నుండి పోటీ చేస్తే మంచిది.

పిఠాపురంగానీ ఏదైనా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో నియోజకవర్గాలలో ఎక్కడ నుండైనా పోటీ చేస్తే గెలవడం తేలికని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. గోదావరి జిల్లాలలో పవన్ కళ్యాణ్ ను సమర్థిస్తున్న ఆయన సామాజికవర్గం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. అయితే గతంలో చిరంజీవి పశ్చిమ నుండి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీనితో జనసేనాని చివరికి ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి

ADVERTISEMENT
Latest Stories