ఖర్చు, శ్రమ తక్కువ.. లాభాలు ఎక్కువ… పవన్ కళ్యాణ్ ప్లాన్ ఇదే

Pawan Kalyan eyes on malayalam movie Driving Licenseపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్నా సినిమాల్లోకి తిరిగి వచ్చి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వకీల్ సాబ్, క్రిష్ సినిమాల షూటింగ్ మొదలు పెట్టారు. గబ్బర్ సింగ్ డైరెక్టర్ తో మరో సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉంది. వకీల్ సాబ్ ఒక రీమేక్ ప్రాజెక్ట్… పవన్ కళ్యాణ్ మరో రీమేక్ చెయ్యనున్నట్టు సమాచారం.

ADVERTISEMENT

మలయాళంలో హిట్టయిన డ్రైవింగ్ లైసెన్స్ అనే సినిమాలో హీరో పాత్రలో పవన్ కళ్యాణ్ నటించబోతున్నట్టు సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ మధ్య రీమేక్ ప్రోజెక్టుల మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఇందులో ఒక మర్మం ఉందట. రీమేక్లలో కూడా తక్కువ శ్రమతో కూడిన స్క్రిప్టులు సెలెక్ట్ చేసుకుని, వాటిని తక్కువలో చుట్టేసి ఎక్కువ లాభాలు పొందాలని పవన్ కళ్యాణ్ ప్లాన్ అంటున్నారు.

పింక్, డ్రైవింగ్ లైసెన్స్ రెండు ఈ కోవకు చెందినవే. డబ్బులు సంపాదించడం కోసమే సినిమాలలోకి తిరిగివచ్చా అని పవన్ కళ్యాణ్ బాహాటంగానే ప్రకటించారు. అయితే ఈ వైఖరి మాత్రం ఆయన సినిమా అభిమానులకు ఇబ్బంది కలిగిస్తుంది. వారు పవన్ కళ్యాణ్ టాప్ లీగ్ లో ఉండే సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నారు.

ఇటువంటి రీమేక్ ప్రాజెక్టులతో అటువంటి అవకాశాలు తక్కువే. ఇది ఇలా ఉండగా.. కరోనా కారణంగా షూటింగులు ఆగిపోవడంతో పవన్ కళ్యాణ్ షెడ్యూల్స్ లో బాగా గ్యాప్ వచ్చింది. దీనితో వచ్చే ఎన్నికలలోగా వీలైనన్ని ఎక్కువ సినిమాలు చెయ్యాలన్న పవన్ టార్గెట్ కి ప్రతిబంధకంగా మారింది.

ADVERTISEMENT
Latest Stories