కాంగ్రెస్ టీడీపీ పొత్తు సరే… మీ విలీనాలు సంగతేంటి పవనూ?

pawan-kalyan-facebook-comments-on-chandrababu-naiduకాంగ్రెస్, తెలుగుదేశం పొత్తుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఫేస్‌బుక్‌ వేదికగా విమర్శలకు దిగారు. గతంలో కాంగ్రెస్ పార్టీ, సోనియాగాంధీపై చంద్రబాబు చేసిన విమర్శల్ని పవన్ తన ఫేస్ బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఒకప్పుడు తిట్టుకున్న నేతలు ఇప్పుడు ఒకటవ్వడం అవకాశవాదం కాక మరేంటని అంటూ ప్రశ్నించారు.

ADVERTISEMENT

[m9ad]

చంద్రబాబు నాయుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయం మరిచి తెలుగు వారి ఆత్మగౌరవం తాకట్టు పెట్టారని ఘాటుగా విమర్శించారు. త్వరలో చంద్రబాబు జగన్‌తోనూ కలిసే అవకాశం లేకపోలేదని ఎద్దేవా చేశారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ విమర్శలకు తెలుగు తమ్ముళ్లు ఘాటుగానే సమాధానం చెబుతున్నారు.

కాంగ్రెస్ టీడీపీ పొత్తు సరే… మీ విలీనాలు సంగతేంటి?అంత అంటరాని పార్టీ అయితే ఆ పార్టీలో ఉన్న మీ అన్నగారి సంగతేంటి? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడింది మీ అన్న కాదా? అప్పుడు కాంగ్రెస్ వాళ్ళ పంచలు ఊడగొడతాం అని ఊదరగొట్టి ఇప్పుడు ఆ నాయకులనే మీ పార్టీలోకి చేర్చుకోవడం లేదా? అంటూ వారు విమర్శిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories