పవన్ కళ్యాణ్ చేతి రాత చూస్తారా?

Pawan-Kalyan-Writingపవన్ కళ్యాణ్ కు ఆమె మాజీ భార్యకు ఎలాంటి సత్సంబంధాలు ఉన్నప్పటికీ, తన వారసులను మాత్రం పవన్ చాలా జాగ్రత్తగా చూసుకుంటారని తెలిసిన విషయమే. తన కొడుకు స్కూల్ కు రమ్మన్నా, కూతురు నృత్య కార్యక్రమానికి హాజరు కావాల్సి వచ్చినా ఒక తండ్రి హోదాలో తప్పకుండా హాజరయ్యే పవన్ కళ్యాణ్ తాజాగా తన కొడుకు గురించి ఏం చేసారో తెలుసా..?

తెలుగులో మరియు ఇంగ్లీష్ భాషలలో సుమతి శతకాన్ని తన కొడుకు పుస్తకంలో పవన్ స్వహస్తాలతో రాసిన పద్యాన్ని రేణుదేశాయ్ ట్విట్టర్ లో పోస్ట్ చేసారు.

“తన కోపమే తన శత్రువు
తన శాంతమే తనకు రక్ష
తన సంతోషమే స్వర్గంబు
తన దు:ఖమే నరకమందురు
తధ్యము సుమతి!” అంటూ పవన్ రాసిచ్చిన పద్యాన్ని ప్రస్తుతం అభిమానులు షేర్ చేసుకుంటూ సందడి చేస్తున్నారు.

Pawan-Kalyan-Writing

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories