పవన్ బాగా ఊహించుకుంటున్నారుగా!

TRP Ratings: Pawan Kalyan's Ban Call Has No Impactగత అయిదేళ్లుగా ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం నిలబడడానికి కారణం పవన్ కళ్యాణ్.

2014లో తెలుగుదేశం పార్టీ గెలవడానికి కారణం పవన్ కళ్యాణ్.

ADVERTISEMENT

అలాగే 10 ఏళ్ళుగా ప్రతిపక్షంలో ఉన్న టిడిపి ఈ రోజు ఈ స్థితిలో ఉండడానికి కారణం పవన్ కళ్యాణ్.

ఏంటి ఈ వ్యాఖ్యలు ఎవరు చేసారో అనుకుంటున్నారా? ఎవరో కాదు స్వయంగా పవన్ కళ్యాణే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో స్పష్టం చేసారు. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ అభిమానులు ఇవే వ్యాఖ్యలు చాలా సందర్భాలలో చేయగా, వారివి అవగాహనా రాహిత్యంగా కొట్టిపడేయగా, తాజాగా పవన్ కళ్యాణ్ కూడా అవే వ్యాఖ్యలు చేయడం దేనికి నిదర్శనం? అభిమానులు, భజనపరుల వ్యాఖ్యలను పవన్ భుజాన వేసుకుని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా? అన్న అనుమానాలు కలుగక మానవు.

2014లో తెలుగుదేశం విజయంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది గానీ, అందులో ఎలాంటి సందేహం లేదు, కానీ పవన్ ఒక్కడే కారణం అని చెప్పడం అవివేకమే అవుతుంది. నాడు తాను చేసిన ప్రచారం వలనే టిడిపి ఏర్పాటు అయ్యిందని పవన్ భావిస్తే, వచ్చే ఎన్నికలలో సింగిల్ పార్టీగా జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందా? పవన్ మాటలను బట్టి ప్రస్తుతం అదే ఊహల్లో ఉన్నట్లుగా కనపడుతోంది. జనసేన అధికారంలోకి రాదు అని చెప్పలేం గానీ, వర్తమాన రాజకీయాలను అర్ధం చేసుకుంటే దాని సాధ్యాసాధ్యాలు అవగతం అవుతాయి.

ADVERTISEMENT
Latest Stories