వైరల్ పిక్: పవన్ కోసం కొడాలి నాని ఎదురుచూపులు!

Pawan-Kalyan-Kodali-Nani-Shake-Hand

గడిచిన రెండు రోజుల నుంచి కొడాలి నాని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు పవన్ అభిమానులు. అదేంటి ప్రొద్దున లేచింది మొదలు పవన్ పై తప్పుడు ఆరోపణలతో విమర్శలు చేసే కొడాలి వీడియోలను పవన్ అభిమానులు ఎందుకు షేర్ చేస్తున్నారా? అన్న సందేహానికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.

ADVERTISEMENT

వంగవీటి రాధా పెళ్లి వేడుక కొడాలి నానికి వైసీపీ అధిష్టానం నుండి చివాట్లను, జనసైనికుల నుండి చీత్కారాన్ని తెచ్చిపెట్టాయి. నూతన వధూవరుణులను ఆశీర్వదించడానికి విచ్చేసిన కొడాలినానికి అదే స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ ఉండడంతో ఆయనను చూడడానికి ప్రజలు ఉత్సహం చూపడంతో, కొంత తోపులాట జరిగి కొడాలి వెనక్కి నెట్టివేయబడ్డ వీడియో ఒకటి ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంది.

అయితే ఈ వీడియోకు తోడు ఇప్పుడు మరో వీడియోను వైరల్ చేస్తున్నారు జనసైనికులు. కొడాలి నాని పవన్ తో చేయి కలపడం కోసం ఆ వేదికమీద ఉన్న జనం దోపులాటను సైతం తట్టుకుని,పవన్ సెక్యూరిటీ గార్డుల ఆదేశాలను పాటించి, పవన్ ద్రుష్టి తన పై పడే వరకు వేచి చూసి ఆ పిదప పవన్ కు షేక్ హ్యాండ్ అందించారు.ఇప్పుడు ఇదే వీడియోను సర్క్యూలేట్ చేస్తూ అయితే ఇదికదా పవన్ స్టామినా అంటూ పవన్ అభిమానులు నానిని ట్రోల్ చేస్తున్నారు.

“దమ్ము ప్రదర్శించేది కాదు అవసరమైనప్పుడు అదే బయటకొస్తుంది” అంటూ సినిమా డైలాగ్స్ తో కొడాలికి సినిమా చూపిస్తున్నారు పవన్ అభిమానులు. పవన్ పక్కన స్టేజి పంచుకోవడానికి నువ్వు ఇంత ఒత్తిడి తీసుకున్నావు, ఆయనతో చేయి కలపడానికి ఆ ఒత్తిడిలో వేచి ఉన్నావు అది నీ స్థాయి మరిచిపోకు అంటూ కొడాలి వీడియోను మళ్ళీ ట్రేండింగ్ లో ఉంచారు నెటిజన్లు.

అయితే మన గుడ్డు మంత్రి గారి మాదిరే పవనే నాతో చేతులు కలపడానికి తిప్పలుపడ్డాడు అంటూ చెప్పి నాని కూడా ట్రోలర్స్ బుర్రలకు పనిపెడతారేమో చూడాలి. మొత్తానికి వంగవీటి రాధా పెళ్లి వేడుక నానికి మోతమోగిస్తుంది అంటూ తెలుగు తమ్ముళ్లు కూడా పనిలో పనిగా ఈ వీడియోను షేర్ చేస్తున్నారు. “ఒక్క దెబ్బకు రెండు పిట్టలు” మాదిరి “ఒక్క వీడియో కు రెండు పార్టీల” మద్దతు.

ADVERTISEMENT
Latest Stories