పవన్ కళ్యాణ్ వామపక్షాలను పూర్తిగా ముంచేశారా?

CPI (M) Let Goes Hope on Pawan -Kalyanఎపిలో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకోదా? ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆ దిశగా కొంత క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ పొత్తులపై అదిగో పులి అంటే, ఇదిగో తోక అన్నట్లు కొందరు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోవడం లేదని, కొంతమంది కావాలని ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.

[m9ad]

ADVERTISEMENT

ఆ పార్టీతో కలుస్తున్నారని, ఈ పార్టీతో కలుస్తున్నారని ప్రచారం జరుగుతోందని ఆయన అన్నారు. తమకు ప్రజల అండ ఉందని, దానితో ముందుకు వెళతామని పనవ్ కళ్యాణ్ పేర్కొన్నారు. కొద్దికాలం క్రితం వరకు జనసేన, వామపక్షాలు కలిసి పోటీచేస్తాయని ప్రచారం జరిగింది. కొన్ని రోజుల పాటు ఇరుపక్షాలు కలిసి పోరాటాలు కూడా చేశారు.

మరి ఏమైందో తెలియదు కాని ఇప్పుడు ఆ విషయం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం లేదు. గత కొద్ది కాలంగా కమ్యూనిస్టుల ప్రాబల్యం రెండు తెలుగు రాష్ట్రాలలో బాగా తగ్గిపోయింది. ఎవరో ఒక పెద్ద పార్టీతో కలిసి పోటీ చేస్తే గానీ ఒకటి రెండు సీట్లు గెలిచే అవకాశం లేకుండా పోయింది. గత ఎన్నికలలో సొంతంగా పోటీ చేసి ఒక్క సీటు కూడా సాధించలేకపోయారు. ఈ సారి పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకుని వేరే పార్టీలను దూరం చేసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తులు లేవంటే వారిని పూర్తిగా ముంచేసినట్టే. ఇలాగే తెలంగాణ ఎన్నికలలో కలిసి వెళదాం అనుకుంటే పవన్ కళ్యాణ్ ఏకంగా పోటీ కూడా చెయ్యడం లేదని ప్రకటించారు.

ADVERTISEMENT
Latest Stories