సినీ మీడియాని ఎక్కడో టచ్ చేసిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan still in birthday mood-పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఒక బడా రాజకీయ నాయకుడు. సొంతంగా ఉన్న అశేష అభిమాన గణంతో పాటు… కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తుతో రాజకీయాలలో బాగా పరపతి పెంచుకున్నారు. తనని తాను సినిమా యాక్టర్ కంటే కూడా రాజకీయ నాయకుడిగానే ఎక్కువగా చూసుకుంటా అని ఆయన ఎప్పుడు చెబుతూ ఉంటారు.

అయితే తనను ఇంతవాడిని చెయ్యడంలో కీలక పాత్ర పోషించిన సినిమాను సినీ మీడియాను మర్చిపోలేదని చక్కటి మెస్సేజ్ ఇచ్చారు పవన్. ఇటీవలే తన పుట్టిన రోజు సందర్భంగా సినీ మీడియా ఇచ్చిన విశేషమైన కవరేజ్ కు గాను ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ… ఒక లెటర్ విడుదల చేశారు.

ADVERTISEMENT

“నా సినీ ప్రస్థానం… మైలురాళ్ళను ప్రస్తావిస్తూ సాగిన వ్యాసాలు, కథనాలు, రాబోతున్న చిత్రాల వివరాలను పాఠకులకు, వీక్షకులకు తెలియచేయడం నన్నెంతో సంతోషపరచింది. ఒకసారి నా ప్రయాణాన్ని గుర్తు చేశారు. కష్టాల్లో ఉన్న జనం గళంగా జనసేన నిలుస్తోంది. ప్రజాక్షేత్రంలోనే ఎక్కువ సమయం వెచ్చిస్తున్నాను. సినీ రంగంలో భాగమైన మీడియా మిత్రులు – నేను ప్రజా జీవితంలో ఉన్నా తమవాడిగా భావించి నా అభిమానులకు, సినీప్రియులకు కనువిందు చేశారు,” అంటూ వారికి ధన్యవాదాలు తెలిపారు ఆయన.

నిజం చెప్పాలంటే రాజకీయ మీడియా కంటే కూడా పవన్ కళ్యాణ్ నూ, జనసేన పార్టీనూ సినీ మీడియానే ఎక్కువ ప్రోత్సహిస్తూ వచ్చింది ఇప్పటివరకు. తమను గుర్తు పెట్టుకుని, తమ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించినందుకు సినీ పాత్రికేయులందరూ ఉబ్బితబ్బివుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories