పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు చెయ్యనిది ఇప్పుడు చేస్తారా?

An Electrifying Action Scene For Powerstar Pawan Kalyan's Comebackరెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తున్నారు. నిన్న ‘పింక్’ రీమేక్ షూటింగ్లో పాల్గొన్నారు. ఫిబ్రవరి నుండి పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈ చిత్రాన్ని మేలో వేసవి సందర్భంగా విడుదల చెయ్యాలని చిత్రబృందం భావిస్తుంది. ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు షూట్ చెయ్యబోతున్నారు.

తక్కువ పనిరోజులు కావడంతో పవన్ కళ్యాణ్ ఇంకో చిత్రం కూడా తెర మీదకు తెస్తున్నట్టు సమాచారం. క్రిష్ దర్శకత్వం వహించే ఈ పీరియడ్ సినిమా ఈ నెల 27న ముహూర్తం జరుపుకుంటుందట. ముందుగా పవన్ కళ్యాణ్ అవసరం లేని సీన్స్ తీస్తారు. ఆగస్టులో ఈ సినిమా విడుదల చెయ్యాలని ప్లాన్.

ADVERTISEMENT

అంటే ఒకే సంవత్సరంలో పవన్ కళ్యాణ్ నుండి రెండు సినిమాలు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రైమ్ లో కూడా ఒకే ఏడాదిలో రెండు సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు. అయితే ఇది జరగాలంటే పవన్ కాస్త కష్టపడాల్సిందే. ఇది ఇలా ఉండగా క్రిష్ సినిమాలో పవన్ కళ్యాణ్ దొంగగా కనిపించబోతున్నారట. మొఘ‌లాయిల కాలానికి సంబంధించిన క‌థ ఇది.

మ‌హ‌మ్మ‌దీయుల ప‌రిపాల‌నా కాలం, అప్ప‌టి ప‌రిస్థితులు… ఇవ‌న్నీ తెర‌పై చూపించ‌బోతున్నారు. పిరియాడిక్ డ్రామా కోసం భారీ సెట్లు వేయ‌బోతున్నారు. కాస్ట్యూమ్స్‌, సెట్స్‌, అప్ప‌టి ఆయుధాలూ తయారు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన కేరీర్ లో పీరియడ్ సినిమా చెయ్యడం ఇదే మొదటి సారి.

ADVERTISEMENT
Latest Stories