పవన్ కళ్యాణ్ ఇంతలోనే ఎంత మార్పు?

Pawan Kalyan praises vice president venkaiah naiduజనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2014-2019 మధ్యలో ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా తీసుకుని రావడమే తన జండా అజెండా అంటూ చెప్పుకునే వారు. ప్రత్యేక హోదా కోసమంటూ రెండు మూడు సభలు పెట్టి ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో ఇస్తామని చెప్పి కేంద్రం రెండు పాచిపోయిన లడ్డులు ఇచ్చింది అంటూ ఎద్దేవా చేసేవారు.

ADVERTISEMENT

తన శక్తి మేర ఆంధ్రప్రదేశ్ లో ఎంతో కొంత చెయ్యడానికి ట్రై చేసిన వెంకయ్య నాయుడుని ఆయన ప్రత్యేకంగా టార్గెట్ చేసేవారు. వెంకయ్య తన శక్తి మేర ప్రయత్నించినప్పటికీ మోడీ, అమిత్ షాల శకంలో అది కుదరలేదు. ఇప్పటికీ ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో అప్పుడప్పుడు చేతైనంత చేస్తూనే ఉంటారు.

అయితే ఎన్నికల తరువాత జనసేనకు జీవన్మరణ సమస్య రావడంతో పవన్ కళ్యాణ్ బీజేపీ పంచన చేరారు. ఇప్పుడు చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఆ పార్టీ నాయకుల నామస్మరణ చేస్తున్నారు ట్విట్టర్ లో. ఆ పార్టీ నాయకులు ట్వీట్ వెయ్యనిదే పాపం రీట్వీట్ కొట్టడానికి రెడీగా ఉంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు బాగా టార్గెట్ చేసిన వెంకయ్య భజనకు కూడా దిగారు పవన్.

“మొక్కవోని వ్యక్తిత్వం.. విలక్షణ రాజకీయ జీవితం.. అమ్మ భాషపై అమితమైన మక్కువ.. చతురత నిండిన వాక్చాతుర్యం.. ఏ విషయంపైనైనా నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడే ఆయన నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందనిపిస్తుంది. ప్రభావవంతమైన ఆయన సలహాలు, సూచనలు సర్వదా ఆచరణీయాలు. ఆయనకు నా వినయపూర్వక కృతజ్ఞతలు,” అంటూ వెంకయ్యపై పొగడ్తలు కురిపించారు పవన్ కళ్యాణ్.

ADVERTISEMENT
Latest Stories