జనసేన… లవ్ స్టోరీ కాదు… రివేంజ్ స్టోరీ..!

Pawan Kalyan revenge story behind janasena partyపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని స్థాపించింది ఎందుకు? ప్రజలపై ఉన్న అమితమైన ప్రేమతోనే ‘జనసేన’ను స్థాపించినట్లుగా పవన్ చెప్పుకొస్తున్నారు. అయితే జనాలపై చూపించే ‘లవ్’తో పాటు, ఓ రివేంజ్ స్టోరీని కూడా బ్యాక్ గ్రౌండ్ లో పవన్ కళ్యాణ్ నడుపుతున్నట్లుగా కనపడుతోంది. అవును…. నాడు మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ‘ప్రజారాజ్యం’ నిర్వీర్యం వెనుక ఉన్న వారికి సమాధానం చెప్పేందుకే జనసేన స్థాపించానని సమయం, సందర్భం నిమిత్తం లేకుండా జనసేన అధినేత ప్రస్తావిస్తున్నారు.

ఇటీవల కాలంలో ‘ప్రజారాజ్యం’ ఉచ్చరణ ఎక్కువ అయిపోతుండడం… బహుశా పరోక్షంగా తన అన్న మీద ఉన్న ప్రేమను, ‘ప్రజారాజ్యం’ మీద అభిమానాన్ని చాటుకుంటున్నారేమో! ఎందుకంటే ‘ప్రజారాజ్యం’ను అమ్మలేదు… అమ్మేలా చేసారంటూ… ఇందులో మెగాస్టార్ గారి తప్పేం లేదన్నట్లుగా వివిధ సందర్భాలలో పవన్ వ్యాఖ్యానిస్తున్నారు. అవకాశం వస్తే ఇదేదో చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడానికి స్కెచ్ వేస్తున్నట్లుగా కనపడుతున్నదే తప్ప, నిజంగా ప్రజాసేవ చేసేందుకు పవన్ రంగంలోకి దిగినట్లుగా అయితే కనిపించడం లేదు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories