పవన్ కళ్యాణ్ ఇచ్చిన ‘పిలుపు’

Pawan Kalyan UKTA Celebrations, Pawan Kalyan UKTA Celebrations London, Pawan Kalyan Speech UKTA Celebrations, Pawan Kalyan London UKTA Celebrationsపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న ఫాలోయింగ్ క్రేజ్, అభిమాన గణం గురించి కొత్తగా చెప్పేదేముంది. ఒక పార్టీ పెడుతున్నాను అంటే లక్షలాది ప్రజలు వచ్చి ఆశీర్వదించారు. అలాంటి విశేషమైన ప్రజాబలం ఉన్న పవన్ కళ్యాణ్ లండన్ వేదికగా జరుగుతున్న యూకేటీఏ (యుక్తా) ముగింపు ఉత్సవాల్లో ఒక పిలుపునిచ్చారు.

“తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు పంచేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతగానో దోహదం చేస్తాయని, ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరుగుతూ ఉండాలని, అప్పుడే మన సంస్కృతి తరతరాలకు నిలిచి ఉంటుందని” పిలుపునిచ్చారు. స్థానిక కళాకారులతో పవన్ సమావేశమైన పవన్… తన వంతులో భాగంగా తానూ నటించే సినిమాల్లో ఇలాంటి సంప్రదాయాలను ప్రతిబింబించేలా చూస్తానని అన్నారు.

ADVERTISEMENT

ఇలాంటి సంప్రదాయాలను ప్రోత్సహించడంలో భాగంగా… తెలుగు ప్రాంతాల్లోని ఆయా యాసలకు సంబంధించిన జానపద పాటలను తన సినిమాల్లో అప్పుడప్పుడు పవన్ స్వీయ గాత్రం ద్వారా అభిమానులకు వినిపిస్తున్న విషయం తెలిసిందే. బహుశా మున్ముందు ఈ ఒరవడి మరింత ఎక్కువగా ఉంటుందేమో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories