జగన్ సరే… అసలు పవన్ కళ్యాణ్ ప్రజలకు ఏం చేశారని?

Pawan Kalyan Target to become Chief minister of Andhra Pradesh2019 లో ప్రజల ప్రేమాభిమానాలు ఉంటే తప్పకుండా ముఖ్యమంత్రిని అవుతానని ఆయన అన్నారు.అప్పుడు మీ ఇంటిలో వాడే సి.ఎమ్. అయ్యాడనుకోండి అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు మరోసారి సిఎం అవ్వాలని, ఆ తర్వాత ఆయన కొడుకు సిఎం అవ్వాలని అంటున్నారని పవన్ కళ్యాణ్ ఎద్దేవా చేశారు.

[m9ad]

ADVERTISEMENT

జగన్ మోహన్ రెడ్డి అయితే.. సీఎం అయితేనే చేస్తానంటారని పవన్ కళ్యాణ్ అన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వాదన కాస్త చిత్రంగానే ఉంది. జగన్ సీఎం అయితేనే చెయ్యగలను అన్నమాట నిజమే మరి సీఎం కాకుండా పవన్ కళ్యాణ్ చేసింది ఏమిటి? ఉద్దానం లాంటి సమస్యలకు ప్రభుత్వం ఎంతో కొంత చేసింది గానీ పవన్ కళ్యాణ్ చేసింది ఏముంది?

ప్రభుత్వం చొరవ తీసుకునేలా చేశాం అంటే అది అప్పట్లో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఇచ్చిన గౌరవం మాత్రమే అని టీడీపీ నేతలు అంటారు. నిజానికి నేటి రాజకీయ వ్యవస్థలో అధికారం లేకుండా ఎవరో మాత్రం ఏం చెయ్యగలరు? కాకపోతే జగన్ మాటమాటకి సీఎం అయితేనే చెయ్యగలను అనడంతో అది తప్పు అవుతుంది. నిజానికి పవన్ కళ్యాణ్ కూడా అధికారం లేకుండా ఉన్న ప్రస్తుత్త పరిస్థితిలో చేసిందేమీ లేదు.

ADVERTISEMENT
Latest Stories