రామ్ చరణ్ బల్లగుద్ది… పవన్ కళ్యాణ్ మైక్ పట్టుకుని..!

pawan kalyan to change his surname‘వినయ విధేయ రామ’ సినిమా నుండి రామ్ చరణ్ తన పేరును ‘రామ్ కొ..ణి..దె..ల..’ అంటూ బల్లగుద్ది చెప్తుంటే…. జనసేన పార్టీ స్టేజ్ పైన నుండి తన పేరు ఇక నుండి ‘కొణిదెల పవన్ కళ్యాణ్’ కాదంటూ పవర్ స్టార్ మైక్ పట్టుకుని చెప్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే… ‘కొణిదెల’ అంటే ఒక్క కాపు కులానికే పరిమితం అవుతున్నానన్న అభిప్రాయాన్ని పవన్ వ్యక్తపరుస్తున్నారు.

[m9ad]

ADVERTISEMENT

తనను ఒక కులానికో, కుటుంబానికో పరిమితం చేయవద్దు…. అందుకే తన ఇంటి పేరును కూడా మార్చుకుంటున్నాను, ఇక నుండి తన ఇంటి పేరు ‘కొణిదెల’ కాదని, ‘తెలుగు’ అని చెప్పుకొచ్చారు. రెండు ఉభయ గోదావరి జిల్లాల మాత్రమే దృష్టి కేంద్రీకరిస్తూ బలంగా ప్రచారం చేస్తుండడం వలన, పవన్ తన కులానికి సంబంధించిన వారిని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శలు వ్యక్తం కావడంతో, అందుకు బదులుగా జవాబిచ్చారు.

ADVERTISEMENT
Latest Stories