పవన్ ను ఆడుకుంటోన్న తెలుగు తమ్ముళ్ళు!

Pawan Kalyan tongue slip on parliament memebers countఆంధ్రప్రదేశ్ కు ఎంతమంది ఎంపీలు ఉన్నారు? ఏంటి ఇది కూడా ఓ ప్రశ్న అనుకుంటున్నారా? ఏమో ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఇదే ప్రశ్న తెగ హల్చల్ చేస్తోంది. సాధారణంగా అయితే 25 మంది ఎంపీలు ఉంటారు, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్ట్యా అయితే ఏకంగా 175 మంది ఉంటారన్నది దీని సారాంశం.

[m9ad]

ADVERTISEMENT

ఇటీవల కాలంలో టంగ్ స్లిప్ కావడం అనేది పవన్ కళ్యాణ్ కు పరిపాటిగా మారింది. ఎంపీల సంఖ్య చెప్పబోయి ఎమ్మెల్యేల సంఖ్య చెప్పి నాలుక కరచుకున్న పవన్ కళ్యాణ్ వీడియో ఇపుడు నెట్టింట సందడి చేస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ కు ముఖ్యమంత్రిని, అసెంబ్లీకి ఎంపీలను పంపించిన ఘనతను మూటకట్టుకున్న పవన్, తాజాగా ఎంపీల సంఖ్యలో కూడా పొరపాటు పడడం విశేషం.

ప్రసంగాలలో టంగ్ స్లిప్ కావడం అనేది కామన్. అయితే అది అప్పుడప్పుడు జరిగితే అందరూ లైట్ తీసుకుంటారు, కానీ ఇలా పవన్ కళ్యాణ్ లా ఎప్పుడూ స్లిప్ అయితే మాత్రం నెటిజన్లకు ఆహారంగా మారతారు. ఒకప్పుడు నారా లోకేష్ కూడా ఇలాగే చాలా విరివిగా టంగ్ స్లిప్ అయ్యేవారు, కానీ ఇప్పుడు రాటు దేలుతున్నారు. అప్పుడు జనసైనికులు లోకేష్ పై పంచ్ లు విసరంతో, ఇప్పుడు పవన్ పై రివేంజ్ తీర్చుకునే అవకాశం తెలుగు తమ్ముళ్ళకు వచ్చింది. అంతేకదా… టైం ఏ ఒక్కరి సొంతం కాదు కదా!

ADVERTISEMENT
Latest Stories