సినీ ఇండస్ట్రీలో తమ తమ పుట్టినరోజులను జరుపుకోని బ్యాచ్ లను పరిశీలిస్తే… పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి వారు అందరి కంటే ఓ రెండడుగులు ముందుంటారు. పుట్టినరోజు కూడా అన్ని రోజుల మాదిరే ఓ సాధారణ రోజులా పరిగణించే వీరు, తాము చేసే సినిమాలకు సంబంధించిన ఏదొక అంశాన్ని మాత్రం తమ తమ పుట్టినరోజుల నాడు అభిమానుల కోసం చెప్తుంటారు.
హీరో డామినేషన్ ఇండస్ట్రీ అయిన టాలీవుడ్ లో… హీరోల పుట్టినరోజున ఫస్ట్ లుక్ గానీ, ఫస్ట్ టీజర్ గానీ, స్పెషల్ టీజర్ ఏదొకటి హంగామా చేస్తుంటుంది. అదే విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అయిన సెప్టెంబర్ 2వ తేదీన అభిమానుల కోసం తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తోన్న సినిమాకు సంబంధించి ఓ పోస్టర్ ను విడుదల చేసారు. నిజానికి ఏ టీజరో ఫ్యాన్స్ ను పలకరిస్తుందని వేచిచూస్తున్న తరుణంలో… కుర్చీ తిప్పే ఓ వీడియో బిట్ తో పాటు కేవలం ఓ పోస్టర్ మాత్రమే విడుదలైంది.
పవన్ పుట్టినరోజు కంటే త్రివిక్రమ్ పుట్టినరోజే నయం అనిపించే విధంగా… ఈ నవంబర్ 7వ తేదీ పవర్ స్టార్ అభిమానులకు గుర్తుండి పోనుంది. ఎందుకంటే… ఈ సినిమా టైటిల్ లోగోతో పాటు, ఒక పాట కూడా విడుదల కాబోతుందన్న వార్త ఫ్యాన్స్ ను ఏడవ తేదీ కోసం నిరీక్షించేలా చేస్తోంది. అనిరుద్ స్వరపరిచిన ‘బయటకొచ్చి చూస్తే….’ అన్న పాట విడుదల కానుండడంతో ఈ సారి త్రివిక్రమ్ బర్త్ డే చాలా గ్రాండ్ లుక్ ను సంతరించుకుంది.


