బిగ్ బాస్ షో లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫస్ట్ టార్గెట్

Pawan Kalyan - TV9 Devi Nagavalliనిన్న రాత్రి బిగ్ బాస్ షో నాలుగవ సీజన్ మొదలయ్యింది. పదిహేను వారాల పాటు జరిగే ఈ షో కోసం పదహారు మంది పోటీదారులను హౌస్ లోకి పంపారు. అందులో ఒకరు టీవీ9 సీనియర్ యాంకర్ దేవి నాగవల్లి. టీవీ9 చూసేవారందరికీ ఆమె సుపరిచితమే. ఇప్పుడు ఆమెను ఎలిమినేట్ చెయ్యడం తమ టార్గెట్ అంటున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు.

గత వారం నటి మాధవీ లత పవన్ కళ్యాణ్ మీద చేసిన వివాదాస్పద కామెంట్లను టీవీ9 పదే పదే టెలికాస్ట్ చేసింది. దానికి జనసేన పార్టీ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసి మరీ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ తరువాత ట్విట్టర్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ #shamelesstv9 అనే హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేశారు.

ADVERTISEMENT

ఒకరకంగా వారంతా టీవీ9 మీద చాలా కోపంగా ఉన్నారు. రెండు సంవత్సరాల క్రితం శ్రీరెడ్డి విషయంలో కూడా టీవీ9 ఇలాగే ప్రవర్తించి పవన్ కు కోపం తప్పించింది. ఇప్పుడు దానిని దేవి నాగవల్లి మీద చూపిస్తామని వారంతా బాహాటంగానే అంటున్నారు. చూడాలి దేవి వారి దాడిని తట్టుకోగలదో లేదో.

అది ఆలా ఉంచితే… ఈ సారి షోకి వచ్చిన వారంతా సెలెబ్రిటీలు కావాలనుకునే వారే… గతంలో ఇదే షోకు సెలెబ్రిటీలు వచ్చే వారు. వీరంతా ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకోగలరో చూడాలి. స్టార్ మా ఈ సారి కంటెస్టెంట్స్ కంటే కూడా కంటెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories