మూడు పార్టీల మధ్య రాజకీయ పొత్తులు కుదర్చడంలో బిజీ బిజీ గా ఉన్న పవన కళ్యాణ్ తాత్కాలికంగా సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో పవర్ స్టార్ సినీ అభిమానులు పవన్ సినిమాల అప్ డేట్స్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నా వారి ఆశలకు ఎప్పుడు నిరాశే ఎదురవుతుంది.
ఇటువంటి నైరాశ్యంలో ఉన్న పవన్ అభిమానులకు ఉస్తాద్ టీమ్ ఊహించని సర్ ప్రైస్ ఇచ్చిందనే చెప్పాలి. ఉస్తాద్ మూవీ నుండి ‘భగత్స్ బ్లేజ్’ పేరుతో ఒక వీడియో ను రిలీజ్ చేసారు. అయితే అసలే రాష్ట్ర ఎన్నికలతో పొలిటికల్ హీట్ రాచుకున్న ఈ నేపథ్యంలో పవన్ మూవీ నుండి అప్ డేట్ అంటే అంటూ అటు సినిమా అభిమానులతో పాటుగా జనసేన అభిమానులు, అలాగే వైసీపీ నాయకులు, కొందరు మంత్రులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తారు.
అలాగే దాని అపి రివ్యూ లు కూడా ఇస్తుంటారు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు. వారి అంచనాలకు తగ్గట్టే భగత్స్ బ్లెజ్ లో జనసేన పార్టీ గుర్తైనా గాజు గ్లాస్, దానికి ఉన్న పవర్ కు సంబంధించిన డైలాగ్స్ ఉన్నాయి. నీ రేంజ్ ఇది అంటూ గాజు గ్లాసుని కిందపడేసి పవన్ ను అవమానిస్తున్న డైలాగ్ తో బ్లేజ్ మొదలవుతుంది. ఈ డైలాగ్ కు కౌంటర్ గా గాజు గ్లాస్ పవర్ ఏంటో తెలిసి వచ్చేలా పవన్ చెప్పే డైలాగ్స్….
గాజు పగిలేకొద్దీ పదునెక్కిద్ది… కచ్చితంగా గుర్తుపెట్టుకో…గ్లాస్ అంటే సైజు కాదు సైన్యం… కనిపించని ఒక సైన్యం…అంటూ పవన్ చెప్పే డైలాగ్స్ అటు రాజకీయపరంగా కూడా పవన్ కు, ఆపార్టీకి మైలేజ్ తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అలాగే మూవీ యూనిట్ వదిలిన ఈ వీడియో తో ఈ మూవీ లో కూడా పవన్ పొలిటికల్ సెటైర్స్ ఉండబోతున్నాయనేది స్పష్టమయింది.
అలాగే దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో పవన్ చెప్పిన డైలాగ్స్ ఇంకాస్తా ఎలివేట్ అయ్యాయనే చెప్పాలి. శ్రీలీల హీరోహిన్ గా నటిస్తున్న ఈ మూవీ కి గబ్బర్ సింగ్ తో పవన్ కు బ్లాక్ బాస్టర్ హిట్ అందించిన హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. హరీష్ పవన్ కాంబో లో వస్తున్న రెండవ సినిమా కావడంతో పవన్ అభిమానులలో విపరీతమైన క్రీజ్ ఉంది.
నేపథ్యంలో ఈ మూవీ కూడా మరో గబ్బర్ సింగ్ కానుంది అంటూ వీడియో ను షేర్ చేస్తూ తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు. అసలే గడిచిన కొంత కాలంగా తన సినిమాతో అభిమానులను నిరాశ పరుస్తున్న పవన్ ఈసారైనా ఆయన స్థాయికి తగ్గ హిట్ అందుకోవాలని ఆశ పడుతున్న పవర్ స్టార్ ఫాన్స్ ఆశలను హరీష్ ఏ మేరకు తృప్తి పరచగలరో వేచి చూడాలి.
ఇక ఎన్నికలు ముగిసి మళ్ళీ పవన్ షూటింగ్లలో పాల్కొనే వరకు పవన్ సినీ కెరీర్ నుండి ఎటువంటి అప్ డేట్ కానీ ఎటువంటి టీజర్ కానీ వచ్చే అవకాశం లేకపోవడంతో పవర్ స్టార్ అభిమానులు ఇక ఈ ఉస్తాద్ బ్లేజ్ ఇచ్చిన పదునుతో సరిపెట్టుకోవాల్సిందే అనుకుంటా. అలాగే పవన్ చెప్పిన ఈ సినిమా డైలాగ్స్ కు హర్ట్ అయిన వైసీపీ, ఆర్జీవీ పవన్ మీద ఆ పార్టీ మీద వేసే పొలిటికల్ కౌంటర్ల పదును పెంచడం ఖాయంగా కనపడుతుంది.
పవన్ కళ్యాణ్ గురించి ఏదైనా వార్త అది సినిమా విషయంలో కానీ పొలిటికల్ ఇష్యూ కానీ మీడియాలోకి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంత స్పీడ్ గా రియాక్ట్ అవుతారో వారితో సమానంగా ఆర్జీవీ కూడా అంతే ఘాటుగా సోషల్ మీడియాలో పవన్ కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టి పవన్ అభిమానులను రెచ్చగొడుతుంటారు. ఇది అటు పవన్ ఫాన్స్ కు ఆర్జీవికి కూడా అలవాటై పోయిందనే చెప్పాలి.




