‘సామాజిక ప్రయోజనం’ కోసం పవన్ కళ్యాణ్ ‘గళం’

Target 100 Crore for Pawan Kalyanతను నటించే సినిమాలలో ఏదొక సందర్భంలో కొన్ని సామాజిక అంశాలను ప్రస్తావించే పవన్ కళ్యాణ్, తాజాగా ఓ మంచి కార్యక్రమం కోసం తన స్వరాన్ని వినిపించడానికి సిద్ధమయ్యాడు. మన దేశంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న క్యాన్సర్ పేషంట్లను మేలుకొలిపే ఓ యాడ్ కోసం ‘వాయిస్ ఓవర్’ ఇవ్వబోతున్నాడు. ప్రాణాంతకమైన క్యాన్సర్ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన కలిగించడానికి, నివారణ చర్యలు తీసుకోవడానికి సందేశంగా ఉండబోయే ఈ యాడ్ ను త్వరలో అన్ని థియేటర్లలో ప్రదర్శిస్తారని సమాచారం.

ADVERTISEMENT

గత మూడు దశాబ్ద కాలాన్ని పరిశీలిస్తే… క్యాన్సర్ రోగులు విపరీతంగా పెరిగి పోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వైద్య రంగంలో సరికొత్త మందులు అందుబాటులోకి రావడంతో కొంతవరకు దీన్ని అదుపు చేయగలిగారు కానీ, ఇంకా మరణాల సంఖ్య గణనీయమైన సంఖ్యలోనే ఉంది. దీంతో క్యాన్సర్ పట్ల మరింత అవగాహన పెంచేందుకు ‘క్యాన్సర్ ప్రివెంటివ్ ఫౌండేషన్’ తీసుకుంటున్న చర్యలలో భాగంగా ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ ఈ యాడ్ కోసం తన గాత్రాన్ని అందించనున్నారు.

ADVERTISEMENT
Latest Stories