పెద్ది ఓటీటీ రిలీజ్.. బుచ్చిబాబు, జాన్వికపూర్ లకు మళ్లీ మొదలు

Peddi OTT release controversy

“పెద్ది” గాయాన్ని ఇప్పుడిప్పుడే బుచ్చిబాబు, జాన్వికపూర్ మర్చిపోతున్న తరుణంలో.. మళ్లీ వాళ్లకి ఒక ఫీల్డ్ డే ఫీల్ ని తీసుకొచ్చింది పెద్ది ఓటీటీ రిలీజ్. ఇవాళ్టి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న “పెద్ది” సినిమా నిజానికి ఎడిటెడ్ వెర్షన్. థియేట్రికల్ వెర్షన్ లో ఉన్న జాన్వికపూర్ క్లోజప్ షాట్స్ అన్నీ రిమూవ్ చేసారు. కొన్ని కామెడీ సీన్స్ యాడ్ చేసారు.

అయినప్పటికీ.. చరణ్ బలవంతంగా జాన్వికపూర్ కి ముద్దు పెట్టే సీన్ మరియు జాన్వీ కపూర్ ఆ ముద్దును, పెద్ది ప్రేమని యాక్సెప్ట్ చేసే సీన్ మాత్రం సినిమాలో ఇంకా ఉన్నాయి. వాటిని కట్ చేయడానికి స్కోప్ కూడా లేదనుకోండి.

ADVERTISEMENT

ఇప్పుడు ఆ సీన్స్ ను పట్టుకొని ట్రోల్ చేయడం మొదలెట్టారు. “పెద్ది” రిలీజ్ టైంలో జాన్వీ కపూర్ కంప్లీట్ గా సైలెంట్ అయిపోయిన విషయం తెలిసిందే. అయితే.. “పెద్ది” సినిమా రిలీజ్ కి ముందు తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలు మాత్రం ఆమె డిలీట్ చేయలేదు.

ఇంక ఒక్కసారి ఓటీటీలోకి వచ్చింది అంటే.. ట్రోలింగ్ ఏస్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రతి సన్నివేశాన్ని స్లో మోషన్ లో జూమ్ చేసి మరీ ఎడిట్ చేసి రకరకాల ఒపీనియన్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు నెటిజన్లు మరియు ట్రోలర్స్.

ఇప్పుడు ఉధృతంగా వచ్చే ఈ ట్రోలింగ్ కి బుచ్చిబాబు, జాన్వికపూర్ ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నారు అనేది తెలియదు కానీ.. వాళ్లిద్దరూ మళ్లీ కొన్నాళ్లపాటు సైలెంట్ అయిపోవడం మాత్రం ఖాయం అనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories