విజయవాడ కేంద్రంగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధం బందర్ వరకు పాకింది. మొన్నీమధ్య మెగా డిఎస్సి లో అక్రమాలు అంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేపట్టిన నిరసన ర్యాలీ టీడీపీ – వైసీపీ మధ్య రాజకీయ చిచ్చుకు కారణమయ్యింది.
తన నియోజకవర్గంలో వైసీపీ చేపట్టిన ఈ అనధికార నిరశన ర్యాలీ ని అడ్డుకునేందుకు గాను బోండా ఉమా తన అనుచరులతో కలిసి వైసీపీ శ్రేణులతో వాగ్వాదానికి దిగారు. దీనితో ఇరువర్గాల మధ్య తీవ్ర ఉద్రికత్త ఏర్పడడంతో ఈ వార్త విజయవాడ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది.
అయితే ఇరు పార్టీల నేతల మధ్య అక్కడ మొదలైన రాజకీయ చిచ్చు ఇప్పటికి అలానే కొనసాగుతూ వెళుతుంది. బోండా ఉమా టార్గెట్ గా వైసీపీ నేతలు ముఖ్యంగా మచిలీపట్టణం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని రెచ్చిపోతున్నారు. ఇక వారి విమర్శలకు కౌంటర్ ఇచ్చేందుకు బోండా కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు.
వైసీపీ నేతలు రెచ్చకొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని, గుణదల కాకపోతే బందరులో నాని ఇంటికైనా రావడానికి తానూ సిద్ధమని, టీడీపీ నేతల కాళ్ళు పట్టుకున్న చరిత్ర పేర్ని నానిదంటూ పేర్ని కి కౌంటర్ ఇచ్చారు. విజయవాడలో వైసీపీ నేతలు ఇష్టం వచ్చిన్నట్టు మాట్లాడితే ఇంటికి వచ్చి మరి కొడతాం అంటూ బోండా కూడా వైసీపీ స్టైల్ హెచ్చరికలు చేసారు.
ముద్రగడ సంతాప సభ కలిపిన ఈ ఇద్దరినీ ఇప్పుడు మెగా డిఎస్సి నిరసన ర్యాలీలు దూరం చేశాయా అంటూ పేర్ని – బోండా వ్యాఖ్యలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.




