‘పెట్టా’…తమిళ ట్రైలర్ అదిరింది…మరి సినిమా?

Petta Tamil Movie Trailerరజనీకాంత్ మోస్ట్ అవైటెడ్ మూవీ..”పెట్టా” తమిళ ట్రైలర్ నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది..అయితే అందరూ ఊహించిన విధంగానే ఇది పక్కా మాస్ మసాలా సినిమా…ఈ సినిమాలో రజని యధావిధిగా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు…

[m9ad]

ADVERTISEMENT

ఇక ఈ సినిమాలో పంచ కట్టుకున్న రజని పొడుగు మీసాలతో ఒక లుక్ ఉంది..కట్ చేస్తే గ్యాంగ్ స్టార్స్ ని దుమ్ము రేగకొట్టే వాడిగా రజని యాక్షన్ అదుర్స్ అనిపించేలా మరో లుక్ ఉంది..ఇక ఈ సినిమాలో కాస్టింగ్ చాలా పెద్దదే…సిమ్రాన్..విజయ్ సేతుపతి…నవాజుద్దీన్ సిద్దిక్వి ఇలా బడా తారాగణమే ఉంది. ఇక త్రిష రజని సరసన రొమాన్స్ చేయనుంది.

మొత్తంగా చూసుకుంటే పెట్టా ట్రైలర్ మాస్ ఆడియన్స్ ని టార్గెట్ గా చేసుకునే కట్ చేశారు అని స్పష్టంగా చెప్పవచ్చు..ఇక అనిరుద్ ఈ సినిమాకి పాటలు అందిస్తున్నాడు..కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు..సన్ పిక్చర్స్ నిర్మాణం చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే పెట్టా ట్రయిలర్ కాస్త రొటీన్ గా ఉన్నా…మాస్ ఎలెమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి…

మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..ఎందుకంటే గత రెండు మూడు సినిమాల (రోబో-2 మినహా) నుంచి రజని ట్రైలర్స్ అరిపిస్తున్నాయి..కానీ సినిమాలు మాత్రం ఉసూరుమనిపిస్తున్నాయి.

ADVERTISEMENT
Latest Stories