విడుదలైన మూడు, నాలుగు వారాలకు ఓటిటిలో సినిమా వచ్చేస్తోంది. థియేటర్లకు వెళ్లడం ఇష్టం లేని వారు దర్జాగా ఇంట్లోనే ఓటిటిల్లో సినిమాలను చూసుకోవచ్చు. ఆ నాలుగు వారాలు కూడా ఆగలేని వారు, ఉచితంగా సినిమా చూడాలని తపించేవాళ్లకు చాలానే వెబ్ సైట్స్ ఉన్నాయి.
వాటిల్లో ప్రముఖమైనది ibomma. విడుదలైన రెండో రోజుకే హెచ్ డి క్వాలిటీలో ప్రింట్ ను దింపుతుంటారు. ఓటిటిలో ఉన్న ఏ కంటెంట్ అయినా ibommaలో వెంటనే ప్రత్యక్షమవుతుంది. ఎన్నిసార్లు బ్లాక్ చేసినా కొత్త డొమైన్ లతో ibomma తిరిగి ప్రత్యక్షమవుతూనే ఉంది. ఈ వెబ్ సైట్ వల్ల టాలీవుడ్ నిర్మాతలకు కోట్లల్లో నష్టం వస్తుండడంతో టాలీవుడ్ ఈ వెబ్ సైట్ పై ఫోకస్ పెట్టింది.
అయితే ఊహించని విధంగా ibomma నుండి ఒక వార్నింగ్ లెటర్ వచ్చింది. మీరు నా మీద ఫోకస్ పెడితే నేను మీ మీద ఫోకస్ పెడతా అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చాడు ibomma నిర్వాహకుడు. కెమెరా ప్రింట్లు తీసే వాళ్ళని వదిలేసి మా మీద ఫోకస్ తగ్గించాలని, దేనికీ భయపడని వాడు చాలా డేంజర్ అంటూ మాస్ సినిమా ఇంటర్వెల్ లెవెల్లో ఉంది ఆ వార్నింగ్. ఇంకా ఆ లెటర్ లో హీరోల రెమ్యునరేషన్ల దగ్గరనుండి అవసరం ఉన్నా లేకపోయినా విదేశాలలో షూటింగ్స్ చేస్తూ అనవసర ఖర్చు పెట్టడం ఇంకా చాలానే టాపిక్స్ టచ్ చేసుకుంటూ వచ్చారు.
“మేం స్వతహా మా వెబ్‌సైట్ నుంచి తొలగిస్తున్నాం. బురదలో రాయి వేయకండి అని.. అది కూడా పెంట మీద అస్సలు వేయకండి. చావుకు భయపడని వాడు.. దేనికి భయపడడు..” అంటూ ibomma పేరుతో ఒక లేఖ వైరల్ అవుతోంది.



