భర్తపై కేసు పెట్టిన ప్రముఖ సింగర్‌

play back singer kousalya harassment case on husband ప్రముఖ ప్లే బ్యాక్‌ సింగర్‌ కౌసల్య తన భర్త బాలసుబ్రమణ్యం గత కొంత కాలంగా వేదిస్తున్నాడు అంటూ సంజీవరెడ్డి నగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు వేదింపులు ఎక్కువ అవ్వడంతో తట్టుకోలేక పోలీసుల ముందుకు వచ్చినట్లుగా ఆమె చెప్పుకొచ్చారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. కౌసల్య ఫిర్యాదుతో ఆమె భర్త బాలసుబ్రమణ్యంను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్‌ ఇవ్వడం జరిగిందట. మరో సారి ఇలా వ్యవహరిస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని ఆయన్ను పోలీసులు హెచ్చరించారు.

చిన్ననాటి స్నేహితుడిని పెళ్లి చేసుకున్న కౌసల్య సంసారం కొంత కాలం సాఫీగానే గడిచింది. కాని కొంత కాలం తర్వాత ఏవో కారణాల వల్ల వీరిద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఆ విభేదాలు కాస్త తారా స్థాయికి చేరుకున్నాయి. ఇంతకు వీరి మధ్య విభేదాలకు కారణం ఏంటా అనేది తేలాల్సి ఉంది. దాదాపు 400 సాంగ్స్‌ను పాడిన కౌసల్యకు తెలుగులో ప్రముఖ సింగర్‌గా పేరుంది. పలు స్టేజ్‌లపై కూడా కౌసల్య పాటలు పాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ADVERTISEMENT
Latest Stories