నిఖిల్ “స్వామి రారా” సినిమాలో కలిసి నటించిన పూజా రామచంద్రన్ గుర్తుందా? అదేలెండి… నిఖిల్ తో కలిసి పర్సులు కొట్టేస్తూ హాట్ బ్యూటీగా అలరించిన పూజా, ఆ తర్వాత తెలుగులో వరుసగా అవకాశాలు అందిపుచ్చుకుంది. అలాగే తమిళంలో కూడా రాణిస్తోన్న ఈ బ్యూటీ, ప్రస్తుతం ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
సోమవారం నాటి ఎపిసోడ్ క్లైమాక్స్ లో ఎవరో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు చూపించిన సదరు ఛానల్, ఎవరు అన్న దానిపై సస్పెన్స్ ను కొనసాగించింది. కానీ సోషల్ మీడియా ద్వారా పూజా రామచంద్రన్ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ఖరారయ్యింది. కవ్వించే ఎక్స్ ప్రెషన్స్ తో ‘స్వామి రారా’లో మనసు దోచుకున్న పూజ, మరి ‘బిగ్ బాస్’లో ఎలా కొల్లగోడుతుందో చూడాలి.
ADVERTISEMENT
ADVERTISEMENT



