పవన్ కళ్యాణ్ ‘కొత్త’ ప్రయోగం

Power Star - Pawan Kalyan 2019 ఎన్నికల ఓటమి తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలకు తిరిగి వచ్చి వరుసగా సినిమాలు చేస్తూ పోతున్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ విడుదలకు సిద్ధంగా ఉంది. క్రిష్ సినిమా, అయ్యప్పనుమ్ కోశియుమ్ సెట్స్ మీద ఉన్నాయి. అలాగే హరీష్ శంకర్ తో ఒక సినిమా అధికారికంగా ప్రకటించారు.

ADVERTISEMENT

సురేందర్ రెడ్డి తో ఇంకో సినిమా ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఒక కొత్త దర్శకుడికి అవకాశం ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. ఒక కొత్త దర్శకుడు చెప్పిన కమర్షియల్ ఎంటర్టైనర్ కథకు పవన్ ఫిదా అయ్యారట. వెంటనే ఒకే చెప్పారని సమాచారం.

సీనియర్ నిర్మాతలు భగవాన్, పుల్లారావులు ఈ సినిమాని నిర్మించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పవన్ సరసన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందట. 2021 చివర్లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని అంటున్నారు. పవన్ ఒక కొత్త దర్శకుడితో పని చెయ్యడం అంటే ప్రయోగం అనే చెప్పుకోవాలి.

మరోవైపు… వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్… అటు రాజకీయాలకు కూడా సమయం వెచ్చించాల్సి వస్తుంది. ఈ రెండు వ్యాపకాలతో పవన్ కళ్యాణ్ నిముషం కూడా ఖాళీ లేకుండా బిజీ బిజీగా గడుపుతున్నారు. ఏపీలో తిరుపతి ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించడంతో మరింత బిజీ కానున్నారు ఆయన.

ADVERTISEMENT
Latest Stories