‘బాహుబలి 2’లో ప్రభాస్ ఎలా ఉన్నాడు?

Baahubalu conclusion working stillsఈ ప్రశ్నకు సమాధానం కావాలంటే ఆ సినిమా యూనిట్ అయితే మరో ఆరు మాసాలు తీసుకోవచ్చు. ఏ పండుగకో, పబ్బానికో ఫస్ట్ లుక్ అంటూ సందడి చేయవచ్చు. కానీ, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం పుణ్యమా అంటూ సెట్స్ లోని పిక్స్ వెబ్ మీడియాలో మరు క్షణమే హల్చల్ చేస్తున్నాయి.

ఆ క్రమంలోనే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లుక్ కూడా బయటకు వచ్చింది. ‘బాహుబలి – ది కన్ క్లూజన్’ పేరుతో రూపుదిద్దుకుంటున్న సినిమాలో ప్రభాస్ మునుపటి లుక్ లోనే దర్శనమిస్తున్నాడు. పెరిగిన గడ్డం, జుట్టు, కాస్ట్యూమ్స్ అన్నీ కూడా ‘బాహుబలి’ సినిమా మాదిరిగా ఉన్నాయి.

ADVERTISEMENT

అయితే ఈ సినిమాలో మాత్రం తమ అభిమాన హీరో నుండి బెస్ట్ అవుట్ పుట్ కావాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ‘బాహుబలి’ సినిమా ఎంత విజయం సాధించినా, దానిలో 90 శాతం పైగా సక్సెస్ క్రెడిట్ రాజమౌళికే దక్కింది. ఆ మిగిలిన శాతాన్నే రానా, రమ్యకృష్ణ, కట్టప్ప, సినిమా సాంకేతిక నిపుణులతో పాటు ప్రభాస్ పంచుకున్నారు. కానీ, ఈ సినిమాలో మాత్రం తమ హీరో దుమ్ము లేపాలని ఆశిస్తున్నారు. మరి వారి ఆశలు ఏ విధంగా నేరవేరతాయో తెలియాలంటే మరి కొన్ని నెలల పాటు వేచి చూడక తప్పాదు.

ADVERTISEMENT
Latest Stories