ఫ్యాన్స్ కు కౌంటర్ వేసిన హీరో… వదలని ఫ్యాన్స్..!

Prabhas Fans counter to Siddharthతమ అభిమాన హీరో పుట్టినరోజులకు సంబంధించి హ్యాష్ ట్యాగ్ లను ఉపయోగిస్తూ 100, 50, 25 రోజులు అంటూ ట్రెండ్ చేయడం ఫ్యాన్స్ కు పరిపాటిగా మారింది. ఇందుకు ఏ హీరో అభిమానులు అతీతులు కారు. అందులో భాగంగానే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా “100 డేస్ టు కింగ్ ప్రభాస్ బర్త్ డే” అంటూ ప్రారంభించగా, దీనికి హీరో సిద్ధార్ద్ కౌంటర్ వేసారు.

ఈ ఏడాదికి 100 రోజులు ఎలాగో, వచ్చే ఏడాదికి 465 రోజులు అంటూ రిప్లై ట్వీట్ ఇచ్చారు. దీంతో ఆగ్రహించిన ప్రభాస్ అభిమానులు సిద్ధార్ద్ ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఒక అభిమాని మాత్రం సున్నితంగా ‘ఎందుకు భయ్యా నీ ఫ్రెండ్ కదా’ అంటూ సిద్దూ – ప్రభాస్ లు ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ సిద్ధార్ద్ కు ట్వీట్ చేసాడు. దీనికి కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు సిద్దూ.

ADVERTISEMENT

‘అందుకే భయ్యా… ఫ్రెండ్ కాబట్టే ఫ్రీడం తీసుకున్నా! డార్లింగ్ కూడా నవ్వుతాడు ఈ జోక్ విని. ప్రతిదానికి టెన్షన్ పడితే లైట్ తీసుకోడానికి టైం ఉండదు కదా భయ్యా?’ అంటూ రిప్లై ఇచ్చాడు. సోమవారం నాడు జరిగిన ఈ ట్వీట్ల ఉదంతంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికీ సిద్దూకి రిప్లై ఇస్తూ హంగామా చేస్తున్నారు. త్వరలో ఇలాంటి ముందస్తు పుట్టినరోజులతో కూడిన హ్యాష్ ట్యాగ్ లను ట్విట్టర్ బ్యాన్ చేయనుందని తెలుస్తోంది.

ADVERTISEMENT
Latest Stories