యాక్షన్ స్టార్ సాయి కుమార్ నటవారసుడిగా రాణిస్తున్న ఆది హీరోగా నటించిన తాజా చిత్రం “గరం.” మదన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం తొలి టీజర్ ను యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ విడుదల చేసారు. ఇటీవల కాలంలో వరుస పరాజయాలు చవిచూస్తున్న ఆదికి ‘గరం’ చిత్ర విజయం కీలకంగా మారింది. దీంతో ప్రయోగాలకు తావివ్వకుండా పక్కా మాస్ కమర్షియల్ సబ్జెక్టుతో వచ్చినట్లుగా టీజర్ చెప్తోంది.
ఆది సరసన ‘హార్ట్ ఎటాక్’ ఫేం ఆదా శర్మ హీరోయిన్ గా నటిస్తుండగా, అగస్త్య సంగీతం అందిస్తున్నారు. ‘పెళ్లైన కొత్తలో’ సినిమా దర్శకుడు పి.మదన్ దర్శకత్వం పైనే ఆది ఆశలు పెట్టుకున్నారు. బ్రహ్మానందం, షకలక శంకర్ ల హాస్యం పండితే ఆది గట్టేక్కినట్లేనని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. మాస్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న “గరం” టీజర్ వీక్షకుల కోసం…
ADVERTISEMENT





