రాధే శ్యామ్ : క్లాసికల్… ట్రాజెడీ క్లైమాక్స్..?

రాధే శ్యామ్ : క్లాసికల్... ట్రాజెడీ క్లైమాక్స్..?యంగ్ రెబల్ స్టార్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షక లోకం ఎదురు చూస్తోన్న “రాధే శ్యామ్” ధియేటిరికల్ ట్రైలర్ విడుదలైంది. మూడు నిముషాల ట్రైలర్ లో ఓ మినీ సినిమానే చిత్ర యూనిట్ చూపించింది. యూనివర్సల్ అప్పీరియన్స్ ఉన్న కంటెంట్ తో జనవరి 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ ట్రైలర్ ఎలా ఉందంటే…

ట్రైలర్ లోని ప్రతి షాట్ ఎంతో గ్రాండ్ గా, విజువల్స్ ఎంతో రిచ్ గా కనపడుతూ ఓ ‘క్లాసికల్ లవ్ స్టోరీ’ని చూడబోతున్నామనే ఫీల్ కలిగించింది. ‘క్లాసికల్ లవ్ స్టోరీ’ అంటే ఎండింగ్ ఖచ్చితంగా ‘ట్రాజెడీ’ అనుకునేరు…. క్లైమాక్స్ ఏమిటో రిలీజ్ రోజునే తెలియాలి గానీ, అదొక్కటే ఈ ట్రైలర్ లో చిత్ర యూనిట్ దాచిన ‘సస్పెన్స్.’

ADVERTISEMENT

విధిని ఎదిరించి హీరో-హీరోయిన్ల నడుమ ప్రేమ నిలబడుతుందా… లేక విధికి ఎవరైనా తల వంచక తప్పదా? అందరి చేతి రేఖలు చూసి భవిష్యత్తు చెప్పేసే హీరో ‘విక్రమాదిత్య’ అలియాస్ ప్రభాస్ కు హీరోయిన్ ‘ప్రేరణ’ అలియాస్ పూజా హెగ్డేతో ప్రేమలో పడితే ఏమవుతుందో ముందే తెలుసా?

ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలను ప్రేక్షకులకు వదిలేస్తూ రిలీజ్ చేసిన ట్రైలర్ క్లాస్ వర్గాల ప్రేక్షకులకు మాత్రమే పరిమితం అవుతోంది. ‘డార్లింగ్’ తర్వాత ప్రభాస్ చేస్తోన్న పూర్తి ప్రేమకధా చిత్రంగా ఈ ‘రాధే శ్యామ్’ నిలవనుంది. ‘జిల్’ సినిమా ఫేమ్ రాధాకృష్ణ ఈ సినిమా దర్శకుడు.

ADVERTISEMENT
Latest Stories