నార్త్ మర్కెట్స్ లో సాహూ కలకలం

Prabhas Saaho bollywood box office collectionsయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహూ చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తొలి ఆట నుండే నెగటివ్ టాక్ తెచ్చుకుని అభిమానులను నిరాశపరచింది. బాలీవుడ్ విషయానికి వస్తే సాహూ మొదటి రోజు మూడో అతి పెద్ద ఓపెనింగ్ సాధించింది. సల్మాన్ ఖాన్ భారత్, అక్షయ్ కుమార్ మిషన్ మంగళ్ మొదటి రెండు స్థానాలలో ఉన్నాయి. బాహుబలి 2 ఘనవిజయం వల్ల వచ్చిన హైప్ తో కలెక్షన్స్ వచ్చాయి గానీ ఈ టాక్ దెబ్బకి ఇక సినిమా కష్టమే అనుకున్నారు అంతా.

ADVERTISEMENT

అయితే ఇక్కడే అందరి అంచనాలు తారుమారు అయ్యాయి. రెండో రోజు ఏకంగా మొదటి రోజు కలెక్షన్ల కంటే ఒక కోటి ఎక్కువే రాబట్టింది. ఈరోజు ఆదివారం, రేపు వినాయకచవితి ఎఫెక్ట్ వల్ల వసూళ్ళు భారీగానే ఉండబోతున్నాయి. బుకింగ్స్ చూస్తే ఆ విషయం అర్ధం అవుతుంది. నెగటివ్ టాక్ వచ్చినా మొదటి వారాంతంలో వసూళ్ళు బావుండటం రెండు తెలుగు రాష్ట్రాల వరకూ అయితే పెద్ద గొప్పేం కాదు. అది స్టార్ హీరోలకు మాములే. అయితే మనం ఇప్పుడు నార్త్ మర్కెట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం.

అక్కడ ఈ రేంజ్ కన్సిస్టెన్సీ అంటే మాటలు కాదు. దీనిబట్టి ప్రభాస్ అక్కడి ఆడియన్స్ మనస్సులో నాటుకుపోయాడు అనే చెప్పుకోవాలి. ఈ టైం లో అసలు సాహూ కు మంచి టాక్ వస్తే ఎలా ఉండేదో తలచుకుని అభిమానులు నిట్టూరుస్తున్నారు. బ్రేక్ ఈవెన్ అనిపించుకోవాలంటే సాహూ ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలలో కలిపి 290 కోట్ల షేర్ రాబట్టాలి. అయితే సినిమా టాక్ కంటే బెటర్ గా పెర్ఫర్మ్ చేస్తున్నా అది కష్టమనే చెప్పుకోవాలి. మంగళవారం నుండి సినిమాకు అసలు పరీక్ష మొదలు కాబోతుంది.

ADVERTISEMENT
Latest Stories