ప్రభాస్ నెక్స్ట్ సినిమా ‘ఫస్ట్ లుక్’ వచ్చేస్తోంది!

Prabhas Sahoo First look Latestయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ టైటిల్ రోల్ పోషించిన “బాహుబలి 2” సినిమా ఈ నెల 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రీ బుకింగ్స్ లో ఆల్ టైం రికార్డులు సృష్టిస్తున్న ఈ సినిమా తర్వాత, ‘యంగ్ రెబల్ స్టార్’ సుజిత్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్ ను ‘బాహుబలి 2’ సినిమాతో పాటు ధియేటర్లలో ప్రదర్శించి ఫుల్ పబ్లిసిటీ కొట్టేసే విధంగా ప్లాన్ చేసారు. ‘బాహుబలి’ మాదిరే ఈ సినిమా కూడా నాలుగు భాషల్లో దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనుంది.

ఈ సమాచారమంతా అధికారికంగా వెల్లడించినదే గానీ, టైటిల్ మాత్రం ఇంతవరకు ఖరారు చేయలేదు. “సాహో” అన్న టైటిల్ తో ప్రభాస్ రాబోతున్నాడని ఇటీవల హల్చల్ చేసినప్పటికీ, దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే అందరికీ షాక్ ఇస్తూ ఈ నెల 23వ తేదీన టైటిల్ లోగో మరియు ఫస్ట్ లుక్ తో యంగ్ రెబల్ స్టార్ అభిమానులకు దర్శనమివ్వనున్నాడు. సరిగ్గా ‘బాహుబలి 2’ విడుదలకు అయిదు రోజుల ముందు విడుదల కాబోయే ఈ లుక్, ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇస్తుందనేది ట్రేడ్ టాక్.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories