బూతు ‘బాబా’కు జగన్ సపోర్ట్!

Prabodhananda-Swami---BJP-YS-Jaganతాడిపత్రి వేదికగా వెలుగుచూసిన ప్రభోదానందస్వామి లీలలకు సంబంధించి సంచలన కధనాలు మీడియాలు ప్రసారం చేయగా, అందులో కొన్ని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ముఖ్యంగా వాడకూడని, రాయలేని పదాలతో హిందూ దేవుళ్ళను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు జుగుప్సాకరంగా మారాయి. దీనిపై ప్రశ్నిస్తే… అంతా మార్ఫింగ్ చేసేసారు, నేను అలా అనలేదు అని ప్లేట్ ఫిరాయించే విధంగా సదరు వ్యాఖ్యలు ఉన్నాయి.

[m9ad]

ADVERTISEMENT

‘ఎ’ కంటెంట్ బూతులు మాట్లాడుతున్న ఈ స్వామిజికి ఏపీ ప్రతిపక్ష నేత జగన్ తనదైన శైలిలో మద్దతు పలకడం విశేషం. నిజంగా సదరు ఆశ్రమంలో ఏం జరుగుతుందో జగన్ కు తెలుసో లేదో అన్న అనుమానం కలుగక మానదు. ఏపీ ప్రభుత్వంపై ఏదొక కారణంతో విమర్శలు చేయాలన్న ఒకే ఒక్క తాపత్రయంతో తప్ప, నిజంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలను తప్పుపడితే, సదరు బాబా చేస్తోన్న కార్యక్రమాలలో తాను కూడా భాగస్వామి అన్న ఆరోపణలకు జగనే అవకాశం ఇచ్చినట్లయ్యింది.

బహుశా ఈ ‘బూతు’ బాబాకు సహకారం అందిస్తే, హిందువుల ఓట్లు కొన్నైనా తనకు పడతాయని భావించారో ఏమో గానీ, ప్రస్తుతం ఆ బాబా పేరుతో ఉన్న వ్యక్తికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సదరు ఆశ్రమంకు చెందిన భక్తులు బిజెపి నేతలతో దిగిన ఫోటోలు కూడా ఈ సందర్భంగా చక్కర్లు కొడుతున్నాయి. చివరికి అంతా టెక్నాలజీ పేరు చెప్పి, ఫేక్ అనే ఆస్కారమే ఎక్కువగా కనపడుతోంది.

ADVERTISEMENT
Latest Stories