రూలర్ సెట్ లో ప్రకాష్ రాజ్ రచ్చ

Prakash Raj controversy at balakrishna ruler movie shootingనందమూరి బాలకృష్ణ కేఎస్ రవికుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు రూలర్ అనే టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. నిర్మాతలు ఇప్పటివరకూ ప్రకటించకపోయినా క్రిస్మస్ కు వస్తుందని సమాచారం. దీపావళి సందర్భంగా రేపు చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

దానితో టైటిల్ మీద, రిలీజ్ డేట్ మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఇలా ఉండగా రెండు రోజుల క్రితం చిత్రం షూటింగ్ లొకేషన్ లో గొడవ జరిగిందని ఒక ఆంగ్ల పత్రిక రాసింది. దర్శకుడు ప్రకాష్ రాజ్, భూమిక, జూనియర్ ఆర్టిస్టుల మీద ఒక సీన్ తీస్తున్నారట. షాట్ రెడీ అయ్యే టైం కి భూమిక దర్శకుడిని ఏదో డౌట్ అడిగిందట.

ADVERTISEMENT

ఆయన చెప్తుంటే, ప్రకాష్ రాజ్ దర్శకుడి మీద చిరాకు పడి కేకలు వేశాడట. షాట్ రెడీ అయ్యాకే నన్ను పిలవాలి కదా అని ఫైర్ అయ్యాడట. ఈ క్రమంలో కెమెరా మ్యాన్ రామ్ ప్రసాద్ కలగచేసుకుని ప్రకాష్ రాజ్ ని వారించాడట. దర్శకుడికి మర్యాద ఇవ్వాలని వారించాడట. కోపంతో ప్రకాష్ రాజ్ లొకేషన్ నుండి వెళ్ళిపోయాడట.

అయితే మళ్ళీ ఏమనుకున్నాడో గాని ఆ తరువాత తిరిగి వచ్చి షూట్ పూర్తి చేసాడట. ఇప్పటికే తన ఇన్-డిసిప్లిన్ తో ప్రకాష్ రాజ్ చాలా అవకాశాలు కోల్పోయాడు. ఒక్కప్పుడు అన్ని సినిమాలలోనూ ఆయన మస్ట్ కాకపోతే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అయినా మారినట్టుగా లేదు.

ADVERTISEMENT
Latest Stories