ఓటిటి లోను అదరగొడుతున్న ప్రశాంత్ వర్మ సూపర్ హీరో హనుమాన్. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ అటు వెండితెర మీద తన సూపర్ పవర్ ను చూపించింది. అగ్ర హీరోల సినిమాలను తట్టుకుని సంక్రాంతి విజేతగా నిలిచింది హనుమాన్.
అయితే అటు వెండితెర అభిమానులను ఆకట్టుకున్న హనుమాన్ కోసం ఇటు బుల్లితెర ఓటిటి ప్రేక్షకులు కూడా ఎంతో కాలం ఎదురుచూసారు. అలాగే హనుమాన్ ఓటిటి రైట్స్ దక్కించుకున్న సదరు ఓటిటి సంస్థ జీ 5 కూడా వారి ఆశలను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ ఎట్టకేలకు ఓటిటి స్ట్రీమింగ్ చేసింది.
దీనితో ఈ సూపర్ హీరో మూవీ కోసం ఎదురుచూసిన ఓటిటి ప్రేక్షకులు ఇటు ఓటిటిలో కూడా హనుమాన్ మూవీ ని సూపర్ హిట్ చేస్తున్నారు. ఓటిటిలో విడుదలైన 5 రోజుల్లోనే తెలుగు వర్షన్ 207 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు చేసుకుంది అంటూ జీ 5 వెల్లడించింది. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై వెండి తెర మీద అనూహ్య విజయాన్ని అందుకున్న ఈ సూపర్ హీరో మూవీ భారీ అంచనాల మధ్య ఓటిటి లో విడుదలైనప్పటి ఇక్కడ కూడా అదే సూపర్ హిట్ టాక్ దక్కించుకుంది.
30 కోట్ల బడ్జెట్ తో వచ్చిన హనుమాన్ థియేటర్లలో దాదాపు 350 కోట్లు రాబట్టింది. చిన్న సినిమాతో పెద్ద పాన్ ఇండియా హిట్ కొట్టిన హనుమాన్ కు సీక్వెల్ గా జై హనుమాన్ రానుంది. హనుమాన్ తో ప్రశాంత్ వర్మ పై అంచనాలు ఆకాశాన్ని తాకిన వేల జై హనుమాన్ ప్రేక్షకులను ఈస్థాయిలో మెప్పించగలదా..? లేదా ఇంతకు మించి ఉంటుందా..? అంటూ ఇప్పటి నుంచే అంచనాలు పెంచుకుంటున్నారు మూవీ అభిమానులు.




