ప్రత్యూష ‘ఆత్మహత్య’కు ముందు ‘అబార్షన్?’

balika vadhu Pratyusha-Banerjee-suicide‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేం బుల్లితెర నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్యోదంతంలో మరో సంచలన విషయం వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకునే నాటికి ప్రత్యూష గర్భవతి అని, ఆత్మహత్యకు ముందు అబార్షన్ చేయించుకుందని ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆప్ ఇండియా’ సంచలన కథనాన్ని ప్రచురించింది.

ప్రత్యూష గర్భవతి అని, అబార్షన్ చేయించుకున్న విషయాన్ని స్వయంగా జేజే ఆసుపత్రి వైద్యులే నిర్ధారించినట్లు కూడా సదరు పత్రిక పేర్కొంది. అయితే ఆ గర్భానికి కారణమెవరన్న విషయాన్ని నిగ్గు తేల్చడం పోలీసులకు దాదాపుగా అసాధ్యమేనని కూడా ఆ కథనంలో తెలపడం మరో సంచలన విషయం.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories