ఆ ‘సీక్వెల్’కి మంచి డిమ్యాండే ఉంది!

Prema katha chitram 2 hindi remake rights సినిమా హిట్ అయ్యింది అంటే చాలు. ఆ సినిమా సీక్వెల్ కోసం భారీగానే ఆలోచన చేస్తారు ప్రేక్షకులు. అయితే ఒక హిట్ అయిన సినిమా సీక్వెల్ వస్తుంది అంటే చాలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తారు. కానీ ఈ సీక్వెల్ విషయంలో మాత్రం అలా జరగడం లేదు కానీ, బిజినెస్ మాత్రం భారీగానే జరుగుతుంది అని తెలుస్తుంది.

[m9ad]

ADVERTISEMENT

ఇంతకీ అసలు విషయం ఏంటి అంటే, యువ దర్శకుడు మారుతి సరదా సరదాగా తెరకెక్కించి భారీ హిట్ చేసిన ‘ప్రేమ కధ చిత్రం’ సినిమా ఎంత బిగ్గెస్ట్ హిట్ అనేది మనం చెప్పాల్సిన పనిలేదు. అయితే ఆ సినిమాకి సీక్వెల్ అయిన “ప్రేమ కధ చిత్రం-2” వస్తుంది అని అందులో మన ఎమ్మెస్ రాజు…అదే అండీ మన నిర్మాత సంక్రాంతి రాజు గారి కుమారుడు సుమంత్ అశ్విన్ నటిస్తూ ఉన్నాడు అని చాలా మందికి తెలీదు లెండి…అయితే ఈ సినిమాలో హీరోకి, అసలు ఈ సినిమా తీసే దర్శకుడికి, అసలు ఈ సినిమా నిర్మాతలకు పెద్దగా క్రేజ్ లేకపోయినా, ఈ సినిమా గురించి మీడియాలో పెద్దగా బజ్ లేకపోయినా ఒక్క టైటిల్ తో మాత్రం ఈ సినిమా మంచి మార్కెట్ ను సొంతం చేసుకుంటుంది అని టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్త.

అయితే హారర్ కామెడీ కావడంతో అశ్విన్ కరియర్ లోనే తొలిసారిగా ఈ సినిమా హిందీ డబ్బింగ్ అండ్ శాటిలైట్ రైట్స్ ను ఏకంగా 1.5 కోట్లకు అమ్మారని తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే మాత్రం అసలు ఈ సినిమా అంటూ ఒకటి ఉంది అని, ఆ సినిమాకు సీక్వెల్ వస్తుంది అని ఎవ్వరికీ తెలియకపోయినా ఒక్క టైటిల్ ఆధారంగా ఈ సినిమాకి భారీ బిజినెస్ అవ్వడం విశేషం. అందుకే మరి బ్రాండ్…బ్రాండ్..అంటూ బ్యాండ్ వేస్తారు.

ADVERTISEMENT
Latest Stories