ప్రియాంకా… ప్రతి అడుగు… క్రేజీనే..!

Priyanka Chopra, rumoured boyfriend Nick Jonasక్వాంటికో, బేవాచ్ లతో అంతర్జాతీయ స్టార్ గా ఎదిగిన బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ తో డేటింగ్ చేస్తోందనే వార్తలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 35 ఏళ్ల ప్రియాంకా 25 ఏళ్ల నిక్ తో కలసి ఇటీవలి కాలంలో పలుమార్లు కెమెరాకు చిక్కింది. తాజాగా వీరిద్దరూ అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి కెమెరా కంటికి చిక్కారు.

ప్రస్తుతం ఈ ఇరువురు కలుసున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు వీరిద్దరూ కలిసి ఓ సినిమా ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్టు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడవుతాయని చెబుతున్నారు. ఏది ఏమైనా ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా మారిన తర్వాత ప్రియాంకా ప్రతి అడుగు క్రేజీ మారుతోందని చెప్పడానికి నిదర్శనమే ఈ ఫోటోలు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories