దండాలయ్యా… బాలయ్యని వదిలేండయ్యా..!

దండాలయ్యా... మా బాలయ్యని వదిలేండయ్యా..!కొన్ని కొన్ని కాంభినేషన్స్ పేర్లు వింటేనే ఫ్యాన్స్ భయపడిపోతుంటారు. అలాంటి అరుదైన కాంబో ‘హీరో బాలయ్య – ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్’ నడుమ ఉందని బాలకృష్ణ అభిమానులు గంట మ్రోగించి మరీ చెప్తున్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు బాలకృష్ణతో “శంకరాచార్య” సినిమా చేయాలని ఉందన్న అభిలాషను వ్యక్తపరిచారు నిర్మాత సి.కళ్యాణ్.

ఈ మాట వినగానే బాలయ్య అభిమానుల గుండెల్లో ఒక్కసారిగా ఆటంబాంబ్ పేలినంత పనయ్యింది. తమ అభిమాన హీరో ఏ సినిమా చేయకపోయినా పర్లేదు గానీ, ఈయనతో మాత్రం చేయవద్దంటూ వేడుకోవడం ఫ్యాన్స్ వంతయ్యింది. ఇలా ఒకటేమిటి… సామదానబేధదండోపాధ్యాయలతో తమ భావాలను మేమ్స్ రూపంలో వ్యక్తపరుస్తున్నారు.

ADVERTISEMENT

నందమూరి అభిమానులు వ్యక్తం చేస్తున్న ఈ భావాలన్నీ నెటిజన్లకు ఆహ్లాదకరమైన హాస్యాన్ని పంచుతున్నాయి. అంతలా తమ సృజనాత్మకతకు పదును పెట్టారు బాలయ్య అభిమానులు. గతంలో సి.కళ్యాణ్ – బాలయ్య కాంభినేషన్ లో “జై సింహ” మరియు “రూలర్” చిత్రాలు విడుదలై అభిమానులు మరియు ప్రేక్షకుల చేత తిరస్కరించబడ్డాయి.

సినిమా కధ బాగుండడం, బాగోకపోవడం పక్కన పెడితే, కనీసం స్క్రీన్ పైన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సరిగా ఉండవనేది అభిమానుల ఆవేదన. ప్రస్తుత తరం ఆశించే టెక్నికల్ అంశాలు లేకుండా, 80 దశకాల్లో సినిమాల మాదిరి ఉండడంతో ‘మా బాలయ్యని ఈ సారికి వదిలేయండి’ అంటూ విజ్ఞప్తులు చేసుకుంటున్నారు.

బహుశా ఇటీవల కాలంలో ఏ హీరో ఫ్యాన్స్ కూడా ఈ స్థాయిలో ఓ ప్రొడ్యూసర్ ని గానీ, డైరెక్టర్ ను గానీ విన్నవించుకోలేదు. ప్రస్తుతం బాలయ్య చేతిలో ఉన్న మూడు సినిమాల తర్వాత తన సినిమాను తీసుకువచ్చి, బాలయ్య కెరీర్ లో మరపురాని చిత్రంగా మలుస్తానని నిర్మాత సి.కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు “అఖండ” జోష్ లో ఉన్న బాలయ్య ఫ్యాన్స్ కు ఏ మాత్రం రుచించడం లేదు.

ADVERTISEMENT
Latest Stories