Telugu

థాంక్యూ ప్రొ.నాగేశ్వర్!

తెలంగాణలో కాంగ్రెస్‌, బిజేపిలు చాలా యాక్టివ్‌గా ఉంటాయి. కానీ ఏపీలో అంత జోరు కనిపించదు. అదేవిధంగా ఏపీలో జనసేన చాలా యాక్టివ్‌గా ఉంటుంది కానీ తెలంగాణ అంత జోరు కనిపించదు.

జనసేనాని పవన్ కళ్యాణ్‌ డెప్యూటీ సిఎం అయిన తర్వాత ఆ పనులతో మరింత బిజీ అయిపోయారు. కనుక తెలంగాణ జనసేనకు సమయం కేటాయించలేకపోతున్నారు. ఆ కారణంగా అక్కడ జనసేన నిద్రాణస్థితిలో ఉందని చెప్పవచ్చు. ఓ సినీ నటుడుగా పవన్ కళ్యాణ్‌పై వారికున్న వీరాభిమానమే తెలంగాణలో జనసేనని కాపాడుతోందని చెప్పవచ్చు.

ADVERTISEMENT

అలా నిద్రపోతున్న తెలంగాణ జనసైనికులను ప్రొ.నాగేశ్వర్ ఒకే ఒక్క ప్రెస్‌మీట్‌తో నిద్రలేపారు. బుధవారం హైదరాబాద్‌, సోమాజీగూడా ప్రెస్‌క్లబ్‌లో ఆయనతో సహా తెలంగాణకు చెందిన కొందరు జర్నలిస్టులు పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు.

అదే ప్రెస్‌క్లబ్‌లో నేడు తెలంగాణ జనసేన నేతలు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వారికి ధీటుగా బదులిచ్చారు.

పవన్ కళ్యాణ్‌కి ఆంద్రా, తెలంగాణ అనే భేదం లేదని నిజానికి అయన యావత్ దేశాన్ని ఎంతగానో ప్రేమిస్తారని వారన్నారు. 2009లోనే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి మద్దతు ప్రకటించారు.

జర్నలిస్టులు, మేధావులు, రాజకీయ విశ్లేషకుల ముసుగులో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టవద్దని జనసేన ఖమ్మం నియోజకవర్గం ఇన్‌ఛార్జ్‌ మిరియాల రామకృష్ణ హితవు పలికారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో జనసేన నేతలు సోషల్ మీడియా ద్వారా ప్రొ.నాగేశ్వర్ తీరుని ఖండించగా, కొందరు మీడియా సమావేశాలు నిర్వహించి ఖండించారు.

నిద్రాణదశలో ఉన్న తెలంగాణలో జన సైనికులందరినీ ప్రొ.నాగేశ్వర్ నిద్ర లేపినందుకు పవన్ కళ్యాణ్‌ ఆయనకు ధన్యవాదాలు తెలుపుకోవాలి.

“సిఎం రేవంత్ రెడ్డిని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడు తెలంగాణపై పెత్తనం చేస్తున్నారు. తెలంగాణ నీటిని దోచుకుపోతున్నారని,” వితండవాదంతో తెలంగాణ సెంటిమెంట్ రాజేసుకోని రాజకీయాలు చేస్తున్న బీఆర్ఎస్‌ పార్టీ కూడా యనకు ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే, ఇప్పుడు తెలంగాణలో జనసేన కూడా యాక్టివ్ అయితే ప్రజలకు చూపేందుకు దానికి మరో కొత్త బూచి దొరికినట్లే కదా?

Share
Ravi Kakarala

Ravi is the head of the Telugu section at M9 News, specializing in providing updates and content in native Telugu language. With extensive experience in Telugu media, Ravi has a strong command of the language and deli…

Published by

Recent Posts

Are Paid Reviews Misleading OTT Audiences?

A film can have a weak trailer, little audience interest and still look like a…

5 minutes ago

AP Local Body Elections: Can CBN and PK Keep the Alliance United?

After the 2024 Assembly election victory, TDP, Jana Sena and BJP are preparing for their…

16 minutes ago