భారీ బడ్జెట్ సినిమాపై పోలీస్ కేస్!

PSV Garuda Vega 126.18Mబాక్సాఫీస్ వద్ద వరుసగా దారుణ పరాజయాలు చవిచూసిన ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ రాజశేఖర్ కు ప్రస్తుతం టాలీవుడ్ మార్కెట్ లేదన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ దాదాపుగా 25 కోట్లు వెచ్చించి “పీఎస్వీ గరుడవేగ 126.18ఎం”తో ఒక భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాకు సంబంధించిన చిత్ర యూనిట్ పై తాజాగా హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసారు.

ఇటీవల విదేశాలలో షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చిన చిత్ర యూనిట్, ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుతోంది. ఇందులో భాగంగా నారాయణగూడ ఫ్లయ్ ఓవర్ పై ఉదయం 7 గంటల వరకూ అనుమతి పొందిన యూనిట్, ట్రాఫిక్ ను ఆపి 7 గంటల తరువాత కూడా షూటింగ్ కొనసాగించడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో అక్కడకు వెళ్లిన పోలీసులు, తక్షణం ఫ్లై ఓవర్ ను ఖాళీ చేయాలని చెప్పగా, యూనిట్ సభ్యులు వాదనకు దిగినట్టు తెలుస్తోంది.

ADVERTISEMENT

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఈ సినిమా నిర్మాతలు, యూనిట్ పై హైదరాబాదు, నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘గుంటూరు టాకీస్’ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ‘విశ్వరూపం’ ఫేం పూజా హీరోయిన్ గా నటిస్తోండగా, మరో కీలక పాత్రలో శ్రద్ధా దాస్ తళుక్కుమననుంది. రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి స్పందన రావడంతో, చిత్ర తొలి టీజర్ కోసం సినీ అభిమానులు నిరీక్షిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories