పూరీ జగన్నాధ్..రవి తేజ లాంటి నటుడు స్టార్ గా మారడంలో పూరీ మార్క్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. అయితే ఆ క్రమంలో ఒకప్పుడు మంచి దూకుడు మీద ఉన్న పూరీ ఆ తర్వాత తన జోరు కాస్త తగ్గడంతో మార్కెట్ లో వెనకబడి పోయాడు. అయితే అనుకోకుండా ఎన్టీఆర్ టెంపర్ తో మళ్లీ ఫాం లోకి వచ్చిన పూరీ బాలయ్యతో సరైన హిట్ కొట్టలేక , ఆ తర్వాత కొడుకుకి సరైన హిట్ ఇవ్వలేక సైలెంట్ అయిపోయాడు.
[m9ad]
కట్ చేస్తే టాలీవుడ్ సమాచారం ప్రకారం పూరీకి ఇప్పుడు రెండు చాన్స్ లు ఉన్నాయట. అందులో ఒకటి యువ హీరో రామ్ తో పూర్తి తన తర్వాత సినిమా ఉండబోతుంది అని టాలీవుడ్ చెబుతుంటే, మరో పక్క అదే టాలీవుడ్ సర్కిల్స్ నుంచి రామ్ తర్వాత విజయ్ దేవరకొండతో పూరీ ఒక సినిమా చేసేందుకు ఇప్పటికే కాకినాడ వెళ్ళి మరీ విజయ్ దేవర కొండకి కధ చెప్పాడు అని తెలుస్తుంది. అయితే విజయ్ తండ్రితో పూరీకి ఉన్న సాన్నిహిత్యం పుణ్యమా అని, విజయ్ తో కూడా పోరీ మంచి రాపో మేన్‌టేన్ చేస్తున్నాడు అని టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్త.
ఇక అన్నీ అనుకున్నట్లుగా జరిగితే పూరీ యువ హీరోలు అయిన రామ్ తోనూ, విజయ్ తోనూ సినిమాలు తీసి, మళ్లీ తన ఫార్మ్ ని వెనక్కి తెచ్చుకుంటాడు అని చెప్పవచ్చు. అయితే పెద్ద హీరోలతో పెద్దగా కలసి రాని పూరీకి చివరకు యువ హీరోలైనా హిట్ ఇచ్చి ‘పూరీ ఈజ్ బ్యాక్’ అన్న టైటిల్ కి జస్టిఫికేషన్ ఇస్తారేమో చూద్దాం.



