అమీర్‌కు అండగా నిలిచాడు

puri jagannath supports aamir khanఅమీర్‌ ఖాన్‌ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న సమయంలో టాలీవుడ్‌ దర్శకుడు పూరి జగన్నాధ్‌ ఆయనకు మద్దతుగా నిలిచాడు. అమీర్‌ ఖాన్‌ వ్యాఖ్యల ఉద్దేశ్యం పూర్తిగా అర్థం చేసుకోకుండా కొందరు ఇలా విమర్శలు చేస్తున్నారని, అమీర్‌ ఖాన్‌ ఆలోచనను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా, కేవలం ఆయన్ను విమర్శిస్తే పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశ్యంతో పలువురు ఆయనపై విమర్శలు చేస్తున్నారని పూరి జగన్నాధ్‌ చెప్పుకొచ్చాడు.

అమీర్‌ చేసిన వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం తెలుసుకునే ప్రయత్నం కంటే కూడా ఆ వ్యాఖ్యలను వివాదం చేయడంకు ఎక్కువ ప్రాముఖ్య ఇస్తున్నారని, పనికి మాలిన వారు మాత్రమే అమీర్‌ ఖాన్‌ అంశంలో విమర్శలు చేస్తున్నారన్నది తన అభిప్రాయం అంటూ పూరి అమీర్‌ ఖాన్‌కు తన పూర్తి మద్దతు తెలిపాడు. అమీర్‌ ఖాన్‌ ఒక సెలబ్రెటీ అవ్వడం వల్లే ఆయన అన్న ఒక్క చిన్న మాటను ఇంతగా లాగుతున్నారని, అమీర్‌ ఖాన్‌ ఒక వేల సెలబ్రెటీ అయ్యి ఉండక పోతే ఏ ఒక్కరు ఆ వ్యాఖ్యలను పట్టించుకోరు అని పూరి అన్నాడు. అదే సమయంలో అమీర్‌ ఒక ఉగ్రవాది అయ్యి ఉంటే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడేవారా అంటూ విమర్శకులను పూరి ప్రశ్నించాడు.

ADVERTISEMENT
Latest Stories