సినిమాలలో చాలా అరుదుగా కొన్ని ప్రత్యేకమైన పాత్రలు సృష్టించబడుతుంటాయి. అది హీరో, విలన్ లేదా మరేదైనా కావచ్చు. అటువంటి పాత్రలు ప్రేక్షకుల మదిలో ఎప్పటికీ నిలిచిపోతుంటాయి.
Also Read – అప్పుడు సంబరాలు..ఇపుడు సందేశాలు..!
ఉదాహరణకు షోలే సినిమాలో ‘గబ్బర్ సింగ్,’ మాయాబజార్ సినిమాలో ఘటోత్కచుడు, గుండమ్మ కధలో సూర్యాకాంతం, ఛాయాదేవీ పాత్రలు, ఎన్టీఆర్ నటించిన పౌరాణిక పాత్రలు, రంగస్థలంలో చెవిటివాడిగా రామ్ చరణ్ వంటి పాత్రలున్నాయి.
పుష్ప-2లో పుష్పరాజ్ పాత్ర కూడా ఆవిదంగానే ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుందని దర్శకుడు రాంగోపాల్ వర్మ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also Read – ఆర్జీవీ…’మెగా’ సెటైర్స్..!
పుష్ప-2 బాగుంది… అద్భుతంగా ఉంది.. అల్లు అర్జున్ ఇరగదీసేశాడు.. అని అందరూ పొగుడుతున్నారు. కానీ ఓ దర్శకుడుగా వర్మ పుష్పరాజ్ పాత్రని చాలా లోతుగా, చాలా చక్కగా విశ్లేషించారు.
కమర్షియల్ సినిమాలలో హీరో అంటే కొన్ని లెక్కలుంటాయి. కానీ అటువంటి హీరో లక్షణాలు లేని పుష్పరాజ్ పాత్రని అల్లు అర్జున్ తన అద్భుతమైన బాడీ లాంగ్వేజ్, అంతకు మించి భావోద్వేగాలతో ఏవిదంగా ప్రేక్షకులను మెప్పించారో వర్మ వివరించారు.
Also Read – ఈ ఏడాది ఏపీకి అంతా శుభం… పండుగ చేసుకోవలసిందే!
పుష్పరాజ్‌తో ముఖ్యమంత్రి ఫోటో దిగేందుకు నిరాకరించి అవమానించినప్పుడు, మందుకొట్టి తన అహం చంపుకుని క్షమాపణ కోరే సన్నివేశంలో అల్లు అర్జున్ నటన ఇందుకు చిన్న ఉదాహరణగా పేర్కొన్నారు. పుష్పరాజ్ పాత్ర కొన్ని దశాబ్ధాలపాటు ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోతుందన్నారు.
ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్ర కోసం అల్లు అర్జున్ తన స్టార్ ఇమేజ్ పక్కన పెట్టేసి, ఆ పాత్రలో లీనమైపోయి అమాయకత్వం, కపటగుణం, విపరీతమైన అహం వంటి వైరుధ్యాలను అద్భుతంగా ప్రదర్శించి మెప్పించారని వర్మ మెచ్చుకున్నారు.
పుష్పరాజ్ పాత్రని చూస్తున్నప్పుడు నిజ జీవితంలో కూడా ఇటువంటివారు ఉంటారని ప్రేక్షకులు నమ్మేలా చేయగలిగారని వర్మ అభిప్రాయపడ్డారు.
అసలు పుష్పరాజ్ పాత్రతో సినిమా స్థాయి పెరిగిందా లేదా సినిమాయే ఆ పాత్రని ఆ స్థాయిలో సృష్టించింద?అని అనిపిస్తుందన్నారు.
ఇప్పుడు పుష్పరాజ్ పాత్రతో పోల్చి చూస్తే అల్లు అర్జున్ చాలా చిన్నగా కనిపిస్తున్నారని రాంగోపాల్ వర్మ అభిప్రాయపడ్డారు.
దాదాపు అన్ని రివ్యూలలో పుష్ప-2లో కధ లేదు పుష్పరాజ్ ఒక్కడే ఉన్నాడని క్లుప్తంగా తేల్చి చెప్పేశాయి. అయితే ఎవరూ పుష్పరాజ్ పాత్రని ఇంత లోతుగా విశ్లేషించి చూపలేదు.
సినీ విశ్లేషకులకి కొన్ని పరిమితులు ఉంటాయి. కనుక ఓవర్ ఆల్‌గా సినిమా ఎలా ఉందో చెప్పారు. కానీ ఓ దర్శకుడుగా వర్మ ఓ పాత్రని ఇంత చక్కగా విశ్లేషించి చెప్పడం అభినందనీయమే. వర్మ చేసిన ఈ విశ్లేషణ సినీ పరిశ్రమలో కొత్తగా ప్రవేశిస్తున్నవారికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది.