devi-sri-prasad-dsp

భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా విడుదలకు సిద్దమయిన పుష్ప -2 ప్రమోషన్స్ లో దూసుకుపోతుంది. పట్నా తో మొదలైన పుష్ప గాడి సంబరాలు నేడు చెన్నై వేదికకు చేరాయి.

Also Read – జగన్‌ అప్పులు చేసిపోతే.. చంద్రబాబు నాయుడు…

అయితే ప్రమోషన్స్ లో పాల్గొంటున్న పుష్ప టీంకు స్థానిక ప్రేక్షకులు పెద్ద ఎత్తున తమ స్పందన చూపిస్తూ సినిమా పై అంచనాలు ఏస్థాయిలో ఉన్నాయో చిత్ర యూనిట్ కు తెలుపుతున్నారు. దీనితో మూవీ యూనిట్ కూడా ఒకపక్క సంతోషంతో మరో పక్క టెన్షన్ తో ఉన్నారు.

నిన్న చెన్నై లో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా శ్రీలీల నటించిన స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ సాంగ్ లాంచింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ మాట్లాడిన మాటలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read – అమరావతి కష్టాలు భోగి మంటలో కాలినట్టేనా.?

చిత్ర నిర్మాత రవి ని ఉద్దేశించి దేవి చేసిన వ్యాఖ్యలతో పుష్ప ‘రచ్చ గెలిచింది కానీ ఇంట గెలవలేకపోయిందా’ అంటూ చర్చ మొదలయ్యింది. డిసెంబర్ 5 న రిలీజ్ కు సిద్దమయిన పుష్ప, మ్యూజికల్ పరంగా ఇంకా పెండింగ్ వర్క్ ఉండడంతో దేవి తో పాటుగా థమన్, మరికొంతమంది పై ఈ బాధ్యతను పెట్టింది పుష్ప టీం.

దీనితో హార్ట్ అయిన దేవి తన ఆవేదనను బహిరంగ వేదిక మీదే వ్యక్తపరిచారు అనే టాక్ నడుస్తుంది. టైం కు పాట ఇవ్వలేదు, బీజీఎమ్ ఇవ్వలేదు, టైం కు ప్రోగ్రాంకు రాలేదు నిర్మాత రవి శంకర్ నా మీద ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తున్నారు, ఇవన్నీ సపరేట్గా అడిగితే కిక్ ఉండదని ఇలా అడిగేస్తున్నా అంటూ నిర్మాతకు తనకు మధ్య ఏర్పడిన దూరాన్ని బయటపెట్టారు దేవి.

Also Read – ఈ టాలీవుడ్‌కి ఏమైయిందో?

అయితే దేవి కామెంట్స్ తో ఊహించని షాక్ తిన్నారు నిర్మాతలు. అయితే దేవి తన పై చిత్ర యూనిట్ చేసే విమర్శలకు బహిరంగంగానే బదులివ్వడం ఇదేమో కొత్త కాదని, గతంలో బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ మూవీ లెజెండ్ విషయంలో కూడా దర్శకుడు తన పై చేసిన పరోక్ష విమర్శలకు అక్కడిక్కడే స్టేజ్ మీదే దర్శకుడికి కౌంటర్ ఇచ్చారు దేవి అనే విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

పుష్ప ప్రమోషనల్ ఈవెంట్స్ ఎంతగా సక్సెస్ అయినప్పటికీ దర్శకుడు సుకుమార్ స్టేజ్ మీద కనిపించకపోవడం, కనిపించిన సంగీత దర్శకుడు దేవి నిర్మాతల పై కాంట్రావెర్సీ డైలాగ్స్ వేయడం సినిమా రిలీజ్ ప్రజర్ ను చూపిస్తుంది. తన సినిమాతో టాలీవుడ్ స్థాయిని పెంచిన పుష్ప అదే టాలీవుడ్ స్థానాన్ని తగ్గించకూడదుగా..!




ఇకనైనా చిత్ర యూనిట్ చేసే ప్రమోషనల్ కార్యక్రమాలలో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే అది పుష్ప టీం తో పాటుగా తెలుగు చిత్ర పరిశ్రమకు బాగుంటుంది అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.