ఓటీటీ పుణ్యమా అంటూ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య నానాటికి తగ్గిపోతూ వస్తోంది. క్రేజీ కాంబినేషన్స్ మరియు పెద్ద హీరోల సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఆ కోవలో ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా “పుష్ప 2” మానియా నడుస్తోంది. ఊహకందని రీతిలో క్రేజీ డీల్స్ తో మార్కెట్ జరగడంతో చిత్ర యూనిట్ ఫుల్ ఖుషీ గా ఉంది.
Also Read – జగన్ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!
దానికి తోడు తాజాగా తెలంగాణ ప్రభుత్వం మునుపెన్నడూ లేని రీతిలో “పుష్ప 2” కోసం టికెట్ల ధరలను అమాంతం పెంచుకునే విధంగా రేట్లను ప్రకటించింది. డిసెంబర్ 4వ తేదీన బెనిఫిట్ షో టికెట్ ధరలను సింగిల్ స్క్రీన్స్ కు 1121 మరియు మల్టీప్లెక్స్ లకు 1239 రూపాయలుగా నిర్ణయించింది.
అలాగే డిసెంబర్ 1వ తేదీ నుండి 4వ తేదీ వరకు 354 & 531, 5 నుండి 12 వరకు 300 & 472, 13 నుండి 29 వరకు 200 & 354 రూపాయలుగా పెంచుకోవచ్చని అనుమతి ఇచ్చింది. ఈ స్థాయిలో ధరలను పెంచుకోవచ్చని అనుమతి ఇవ్వడం ఇదే తొలిసారి. “బాహుబలి 2” అండ్ “ఆర్ఆర్ఆర్, సలార్” సినిమాలకు కూడా ఈ స్థాయిలో టికెట్ ధరలను పెంచలేదు.
Also Read – అక్కడ కవిత.. ఇక్కడ గుడివాడ సేమ్ టూ సేమ్!
ప్రేక్షకులలో “పుష్ప 2” సినిమాకు భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న మాట వాస్తవమే గానీ, మరీ ఈ స్థాయి ధరలకు ప్రేక్షకుల ముఖచిత్రాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. టికెట్ ధరలను ప్రకటించడంతో బహుశా రేపో, మాపో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమవుతాయి. వాటిని బట్టి “పుష్ప 2” చిత్ర యూనిట్ తీసుకున్న నిర్ణయం ఏ పాటిదో తెలుస్తుంది.
ఈ స్థాయిలో పెంచిన టికెట్ ధరలతో సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే, బహుశా భారత చిత్ర పరిశ్రమలో తెలుగు సినిమా మరో మెట్టు ఎక్కుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో “పుష్ప 2” క్రేజ్ ప్రేక్షకులను ఒక ఊపు ఊపుతోంది. “పుష్ప” సినిమా విషయంలో చేసిన పబ్లిసిటీ తప్పును సవరించుకుని ప్రస్తుతం ఇండియా అంతటా తిరిగేసి ఓ రేంజ్ లో పబ్లిసిటీ నిర్వహించారు.
Also Read – ఈ విందుని జగన్ జీర్ణించుకోలేరేమో?
అయితే అనుకున్న విధంగా కాకుండా సినిమాకు పాజిటివ్ టాక్ లభించని పక్షంలో, టికెట్ ధరలు ప్రేక్షకులను థియేటర్లకు రానివ్వకుండా చేస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు. గతంలో విడుదలైన పెద్ద సినిమాలే ఇందుకు నిదర్శనం. వీటన్నింటిని దాటుకుని “పుష్ప 2” సిల్వర్ స్క్రీన్ పైన ఎలా సందడి చేస్తాడో చూడాలి.